ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చినట్లు ఏపీకి ఇవ్వాలి, అందుకే అప్పు: పల్లె
అనంతపురం: ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చిన మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా రాయితీలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ విప్ పల్లె రఘునాథ్ రెడ్డి సోమవారం కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు పరచాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని తేల్చి చెప్పారు. ప్రజల అవసరాల కోసమే తమ ప్రభుత్వం అప్పు చేస్తోందన్నారు.

తమ ప్రభుత్వం పైస అప్పు చేస్తే పది పైసలు ఆదాయం వచ్చే విధంగా ఆలోచన చేస్తుందని తెలిపారు. తమకు రాజకీయ ప్రయోజనాల కంటే ఏపీ ప్రయోజనాలే ముఖ్యమన్నారు.












Click it and Unblock the Notifications