వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జోగి రమేష్ చంద్రబాబు ఇంటిపై దాడి అందుకే ; మొద్దు శీనుతో పోల్చి పంచుమర్తి అనురాధ సంచలనం

|
Google Oneindia TeluguNews

టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై వైసిపి ఎమ్మెల్యే జోగి రమేష్, తన అనుచరులతో కలిసి దాడి చేశాడని, జగన్ ఆధ్వర్యంలోనే వైసిపి గుండాల దాడి జరిగిందని ఆరోపణలు గుప్పిస్తున్న టీడీపీ నేతలు జగన్ సర్కార్ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని పేర్కొన్న టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ, ఒక్క ఛాన్స్ ఇస్తే ఎంతకైనా తెగిస్తాం అన్న చందంగా వైసీపీ నేతల తీరు ఉందని విమర్శలు గుప్పించారు.

జోగి రమేష్ చంద్రబాబు ఇంటిపై దాడి చేసింది ఇందుకే

జోగి రమేష్ చంద్రబాబు ఇంటిపై దాడి చేసింది ఇందుకే

వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ పై విరుచుకుపడ్డ ఆమె సారా కాచే జోగి రమేష్, కిరాయి రౌడీ అంటూ ధ్వజమెత్తారు. పెడన నియోజకవర్గంలో అభివృద్ధి గాలికొదిలేసిన జోగి రమేష్ చంద్రబాబు ఇంటిపై దాడికి తెగబడ్డాడు అని ఆమె మండిపడ్డారు. ఇక మంత్రి పదవి కోసమే ఎమ్మెల్యే జోగి రమేష్ జగన్ దృష్టిలో పడడం కోసం ఈ తరహా చర్యకు పాల్పడ్డాడని, చంద్రబాబు ఇంటి పై జోగి రమేష్ దాడికి గల కారణాన్ని చెప్పారు పంచుమర్తి అనురాధ. మంత్రి పదవి కోసం ఇంత నీచానికి దిగజారుతావా అని ప్రశ్నించారు.

పెడన నియోజకవర్గంలో జోగి రమేష్ అరాచకాలు ఇవే

పెడన నియోజకవర్గంలో జోగి రమేష్ అరాచకాలు ఇవే


రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఎక్కడ ఉందని ప్రశ్నించిన ఆమె వైసీపీ నేతలు ల్యాండ్, శాండ్ , మైనింగ్ మాఫియాగా చెలరేగిపోతున్నారు. పెడన నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాలు వైసిపికి ఓటేయడం పోతే రద్దు చేస్తామని బెదిరించి మరీ జోగి రమేష్ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నియోజకవర్గంలో జోగి రమేష్ అన్నిరకాలుగా వసూళ్లకు తెగబడ్డారని విమర్శించారు. చెరువుల కబ్జా కలంకారీ వసూళ్ల వరకు జోగి రమేష్ చెయ్యని దందాలు లేవని నిప్పులు చెరిగారు. కమీషన్లు ఇవ్వకుంటే జైల్లో పెడతామంటూ పెడన నియోజకవర్గంలో కాంట్రాక్టర్లను పీక్కు తింటున్నారు అని వ్యాఖ్యానించారు.

 కడుపుకు తినేది అన్నమా గడ్డా ? ఇంత దిగజారుడుతనమా

కడుపుకు తినేది అన్నమా గడ్డా ? ఇంత దిగజారుడుతనమా

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఇంటిపై రౌడీ మూకతో వెళ్తావా అని ప్రశ్నించిన పంచుమర్తి అనురాధ, కిరాయి రౌడీలతో దాడులు చేస్తూ రాష్ట్రాన్ని బీహార్ లా మారుస్తారా అంటూ మండిపడ్డారు. మంత్రి పదవి కోసం ఇంతలా దిగజారడం అవసరమా అంటూ ప్రశ్నించారు. జోగి రమేష్ కడుపుకి తినేది అన్నమా గడ్డా అని నిలదీశారు. బీసీ నేత అయ్యుండి బీసీలకు అన్యాయం చేస్తున్న బీసీ వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించడం లేదో చెప్పాలని ప్రశ్నించారు అనురాధ. రెండున్నరేళ్లుగా బీసీలపై దాడులు చేస్తుంటే జోగి రమేష్ నోరు ఎందుకు మెదపలేదు అని ప్రశ్నించిన ఆమె చంద్రబాబు ఇంటి పై దాడి చేయడానికి, నోటికొచ్చినట్టు మాట్లాడటానికి నోరు లేస్తుందా అంటూ నిలదీశారు.

జోగి రమేష్ బ్రతుకేంటో అందరికీ తెలుసు

జోగి రమేష్ బ్రతుకేంటో అందరికీ తెలుసు

భీమవరానికి చెందిన శ్రీనివాసరెడ్డికి పెడనలో ఏం పని అని ప్రశ్నించిన ఆమె, జోగి రమేష్ కు శ్రీనివాస్ రెడ్డి, మలిశెట్టి రాజా, కొల్లాటి గంగాధర్ లు బినామీలని, పాలడుగు ప్రసాద్ ఎవరో జోగి రమేష్ సమాధానం చెప్పాలని జోగి రమేష్ ను తూర్పారబట్టారు. జోగి రమేష్ బ్రతుకు ఎంతో అందరికీ తెలుసన్నారు. పేదలకు పట్టెడన్నం పెట్టే అన్నా క్యాంటీన్ లను మూసివేశారని, అమరావతి రైతులు కష్టపడుతున్నా వారిని పట్టించుకోవడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బీసీల అభివృద్ధి కోసం తెచ్చిన ఆదరణ పథకానికి తూట్లు పొడిచారని పంచుమర్తి అనురాధ విమర్శించారు.

 అయ్యన్న వ్యాఖ్యలను సమర్ధించిన పంచుమర్తి అనూరాధ

అయ్యన్న వ్యాఖ్యలను సమర్ధించిన పంచుమర్తి అనూరాధ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హత్యాచారాంధ్రప్రదేశ్ గా, అత్యాచారాంధ్రప్రదేశ్ గా మారుస్తున్నారని విమర్శించారు. అయ్యన్నపాత్రుడు మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని ఆయనకు మద్దతు పలికిన పంచుమర్తి అనురాధ చెత్త పై పన్నులు వేస్తూ చెత్త రాజకీయాలు చేసేవారిని చెత్త మనుషులు అనకపోతే ఏమంటారు అంటూ ప్రశ్నించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారని, టిటిడిని రాజకీయ వ్యాపార కేంద్రంగా మార్చాలని, దుష్ట రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని మంట గలుపుతున్నారని పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు.

జోగి రమేష్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్

జోగి రమేష్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్

చంద్రబాబు ఇంటి వద్ద దాడి ఘటనపై జోగి రమేష్ బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే ఊరుకునేది లేదంటూ పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు. జోగి రమేష్ తనను తాను దిగజార్చుకున్నారని, మొద్దు శీనుకు జోగి రమేష్ కు తేడా లేదని పంచుమర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.మంత్రి పదవి కోసం జగన్ దగ్గర మార్కుల కోసం ఇంత నీచానికి ఒడిగట్టవలసిన అవసరం లేదంటూ పంచుమర్తి అనురాధ నిప్పులు చెరిగారు.

వైసీపీ నేతల దాడిని ఖండించిన మాజీ మంత్రి పీతల సుజాత

ఇక వైసీపీ నేతలు గుండాల మాదిరిగా వ్యవహరిస్తున్నారని మాజీమంత్రి పీతల సుజాత ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇంటి పై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను అని పేర్కొన్న మాజీమంత్రి పీతల సుజాత ప్రతిపక్ష నేత ఇంటి పైన దాడి చేయడం సిగ్గుచేటని తప్పుబట్టారు. వైసీపీకి ఒక్క అవకాశం వస్తే ప్రజలకు సేవ చేస్తామని చెప్పిన వైసీపీ నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత గుండాల మాదిరిగా వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. వైసిపి నేతలు పద్ధతి మార్చుకోవాలని పీతల సుజాత హితవుపలికారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులు అధికార పార్టీకి వత్తాసు గా మారారని, డీజీపీ గౌతమ్ సవాంగ్ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని పీతల సుజాత ఆరోపించారు. పోలీసులు వైసీపీ కార్యకర్తల తీరుగా వ్యవహరిస్తున్నారని మండిపడిన సుజాత టిడిపి నేతలపై లాఠీఛార్జి చేయడమేంటని పోలీసులను ప్రశ్నించారు.

English summary
Panchumarthi Anuradha fires on YCP MLA Jogi Ramesh is a rowdy. She was incensed that Jogi Ramesh, who had blown up development in Pedana constituency, had attacked the chandrababu house. Panchumarthi Anuradha said that MLA Jogi Ramesh had committed such an act to get Jagan's attention for his ministerial post and the reason behind Jogi Ramesh's attack on Chandrababu's house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X