వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుపతిలో వైసీపీ జాతిరత్నాలు , ఏడు నియోజకవర్గాల్లో ఏడుగురు దందా రాయుళ్ళు : పంచుమర్తి పంచ్ లు

|
Google Oneindia TeluguNews

తిరుపతిలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార ,ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిని మించి ఒకరు విమర్శల పర్వానికి తెర తీస్తున్నారు . తాజాగా టిడిపి ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో వైసిపి జాతి ముత్యాలు పాల్గొంటున్నారు అంటూ వైసీపీ మంత్రులను టార్గెట్ చేశారు .

Recommended Video

#tirupathibypoll చిత్తూరు: తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ జాతి రత్నాలు ప్రచారం : పంచుమర్తి అనురాధ

ఏడు నియోజకవర్గాల్లో ఏడుగురు దందారాయుళ్ళు వైసీపీ తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారని పంచుమర్తి అనురాధ విమర్శలు గుప్పించారు.

 అమరావతిపై జగన్ విషం కక్కుతున్నారు .. వాటికి జగన్ రెడ్డే బ్రాండ్ అంబాసిడర్ : పంచుమర్తి అనురాధ అమరావతిపై జగన్ విషం కక్కుతున్నారు .. వాటికి జగన్ రెడ్డే బ్రాండ్ అంబాసిడర్ : పంచుమర్తి అనురాధ

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో ఏడుగురు మంత్రులపై పంచుమర్తి అనురాధ సెటైర్లు

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో ఏడుగురు మంత్రులపై పంచుమర్తి అనురాధ సెటైర్లు


వైసిపి మంత్రుల బెదిరింపులకు తిరుపతి ప్రజలు భయపడవద్దని , నిజం బతకాలంటే ఓటర్లు టిడిపికి పట్టం కట్టాలని పంచుమర్తి అనురాధ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వైసీపీ ఆగడాలకు అంతే లేకుండా పోయిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పంచుమర్తి వైసీపీ మంత్రులను టార్గెట్ చేసి విమర్శల బాణాలను సంధిస్తారు.

బాలినేని మంత్రి అయిన తర్వాత కనీసం ఒక ఎర్రచందనం దొంగను అయినా పట్టుకున్నారా అంటూ ప్రశ్నించిన అనురాధ కొడుకును అడ్డం పెట్టుకుని మంత్రి బాలినేని మైనింగ్ లో అడ్డంగా సంపాదిస్తున్నారు అంటూ విమర్శించారు. ఇక మీరు ఓట్లు అడిగేందుకు వెంకటగిరి కి వెళ్ళారా అంటూ ప్రశ్నించారు.

ఓట్లు అడగటానికి ఏ ముఖం పెట్టుకుని వెళ్ళారని విమర్శలు

ఓట్లు అడగటానికి ఏ ముఖం పెట్టుకుని వెళ్ళారని విమర్శలు


మంత్రి ఆదిమూలపు సురేష్ నుద్దేశించి ఫైర్ అయిన పంచుమర్తి అనురాధ విద్యాశాఖ మంత్రిగా కరోనాపై ఒక్కసారైనా స్కూళ్ళలో సమీక్ష చేశారా ? మధ్యాహ్న భోజన పథకంలో గుడ్ల సరఫరా గురించి ప్రతిపక్ష పార్టీ నాయకులు గా మేము ప్రశ్నించినా సమాధానం చెప్పలేక గుడ్లు తేలేసిన మంత్రి ఇప్పుడు ఓట్లు అడగడానికి తిరుపతికి వెళ్లారా అంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ పై విరుచుకుపడ్డారు.ఖరీఫ్ రబీ కి తేడా తెలియని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు శ్రీ కాళహస్తి కి వెళ్లి ఏం ప్రచారం చేస్తున్నారో ఆయనకే తెలియాలి అన్నారు.

శాఖల్లో పని చెయ్యని మంత్రులు , తిరుపతిని ఉద్ధరిస్తారా ?

శాఖల్లో పని చెయ్యని మంత్రులు , తిరుపతిని ఉద్ధరిస్తారా ?

పారిశ్రామిక మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి రాష్ట్రానికి ఒక కొత్త పరిశ్రమ అయిన తీసుకొచ్చారా ? చంద్రబాబు తీసుకువచ్చిన పరిశ్రమలను తరిమి కొట్టడం తప్ప మీరు చేసింది ఏంటి అంటూ ప్రశ్నించిన అనురాధ తిరుపతిలో ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు అంటూ నిలదీశారు.

ఇక క్రికెట్ బెట్టింగ్లు నిర్వహించే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి పోలవరం పనులను గాలికొదిలేసి గూడూరును ఉద్ధరించడానికి వచ్చారా సెటైర్లు వేశారు.

కొడాలి నాని పేకాట క్లబ్బులు , పెద్దిరెడ్డి ఆగడాలు .. అంటూ పంచుమర్తి సూపర్ పంచ్ లు

కొడాలి నాని పేకాట క్లబ్బులు , పెద్దిరెడ్డి ఆగడాలు .. అంటూ పంచుమర్తి సూపర్ పంచ్ లు

సత్యవేడులో కొడాలి నాని కి ఏం పని .. పేకాట క్లబ్ తెరవడానికి వెళ్లారా అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు పంచుమర్తి అనురాధ. పింక్ డైమండ్ వ్యవహారం పై హైకోర్టు మొట్టికాయలు వేసిన వైసీపీ ప్రభుత్వానికి సిగ్గు రాలేదని అనురాధ పేర్కొన్నారు. మంత్రి పేర్ని నాని తిరుపతిలో ఏ మొహం పెట్టుకొని తిరుగుతున్నారని ప్రశ్నించిన అనురాధ , ఇక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగడాలకు అడ్డే లేదన్నారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో నిజం బ్రతకాలంటే టిడిపిని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.

English summary
Recently, TDP general secretary Panchumarthi Anuradha targeted YCP ministers who are in elections campaign in tirupati. saying that YCP jathiratnalu was involved in the by-election campaign. Panchumarthi Anuradha lashed out at Minister Balineni, Kodali Nani, Adimulapu Suresh, Peddireddy Ramachandra Reddy, Kursala Kannababu, Mekapati Gautam Reddy and Perni Nani, who are said to be seven illegal activists in seven constituencies
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X