నగరంలో సందడి చేసిన ‘బంగారం చొక్కా’ పంకజ్(ఫొటో)
హైదరాబాద్: అతని పేరు పంకజ్ పరేఖ్. ముంబైకి చెందిన పంకజ్ ఎక్కడికి వెళ్లినా ప్రధాన ఆకర్షణగా నిలుస్తారు. ఎందుకంటే అందరిలా కాకుండా.. అతను వేసుకున్న చొక్క బంగారంతో చేసింది కావడమే.
ఆయన వేసుకున్న చొక్కా 4 కిలోల బంగారంతో తయారు చేయించారు. బంగారమంటే ఎంతో ఇష్టపడే ఈ వ్యాపారి మహిళలకు మించి బంగారం ధరిస్తారు. చేతికున్న రెండు కడియాలు, ఉంగరాలు కలిపి మూడు కిలోలు. కళ్లజోడు 30 గ్రాములు. మొత్తంగా ఆయన ఒంటిపై అక్షరాలా ఏడున్నర కిలోల బంగారం ధరించారన్నమాట.

గృహప్రవేశ మహోత్సవం సందర్భంగా నగరంలోని హిమాయత్‌నగర్‌లో ఉంటున్న సోదరుడు ప్రదీప్ పరేఖ్ ఇంటికి వచ్చిన ఈ బంగారు చొక్కా మనిషి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు.
చూసినవాళ్లందరూ ఆయన దీన్నెలా కాపాడుకుంటున్నారోనంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
కాగా, పలు వ్యాపారాలు నిర్వహిస్తున్న పంకజ్.. ముంబైలోని యోలా మున్సిపల్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఎన్సీపి నేత కూడా.












Click it and Unblock the Notifications