విధ్యార్థినితో లెక్చరర్ పరారీ, హల్ టిక్కెట్టు ఇప్పిస్తానంటూ ఇలా....

జూనియర్ కాలేజీ విధ్యార్థినితో లెక్చరర్ పారిపోయిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకొంది.

గుంటూరు:ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చాడు ఓ ప్రబుద్దుడు. విద్యాబుద్దులు నేర్పాల్సిన గురువు విధ్యార్థిని కిడ్నాప్ చేశాడు. తమ కూతురు ఆచూకీని తెలపాలంటూ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకొంది.

గుంటూరు జిల్లా వినుకొండ మండల పరిధిలోని సీతయ్య కాలనీకి చెందిన తమ కూతురును లెక్చరర్ శ్రీకాంత్ కిడ్నాప్ చేశాడని తల్లిదండ్రులు గుంటూరు రూరల్ ఎస్ పికి ఫిర్యాదు చేశారు.

parents complaint against lecturer in guntur

ఈ నెల 5వ, తేదిన లెక్చరర్ శ్రీకాంత్ తమ ఇంటికి వచ్చి తమ కూతురును బైక్ పై తీసుకెళ్ళాడని తల్లిదండ్రులు చెప్పారు. హల్ టిక్కెట్టు ఇస్తున్నారని చెప్పి మరీ తీసుకెళ్ళారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తే స్పందించకపోవడంతో ఎస్ పి ని ఆశ్రయించారు.

ఆ రోజు నుండి శ్రీకాంత్ , తమ కూతురు ఆచూకీ లేకుండా పోయారని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. శ్రీకాంత్ కు గతంలోనే వివాహమైంది. అయితే భార్యతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నాడని వారు చెప్పారు. తమకు న్యాయం చేయాలని గుంటూరు రూరల్ ఎస్ పి కోరారు తల్లిదండ్రులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+