డబ్బుకోసం కూతురుకి 6 పెళ్లిళ్లు, లాడ్జికి తీసుకెళ్తుండగా

సొంత కూతురుకు డబ్పుల కోసం రెండేళ్లలోనే ఆరు వివాహాలు చేశారు. హఫీజ్ బాబా నగర్‌కు చెందిన అక్బర్, ఆయన రెండో భార్య తమ 17 ఏళ్ల కూతుర్ని 2012లో 30 వేల రూపాయలు తీసుకుని నాగపూర్‌కు చెందిన బషీర్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాత పుణెకు చెందిన జమాల్, ముంబైలో మరో ఇద్దరికి, 2013 ఫిబ్రవరిలో మరొకరికి ఇచ్చి వివాహం జరిపించారు.
చివరిగా జనవరి నెల 14వ తేదీన సూడాన్ కు చెందిన 50 ఏళ్ల మన్నాన్ దగ్గర లక్ష రూపాయలు తీసుకుని కూతుర్ని అతడికి కట్టబెట్టారు. అతడు ఆ బాలికను ఒక లాడ్జికి తీసుకెళుతుండగా ఆమె తప్పించుకుంది.
మన్నన్ ఎంజె మార్కెట్లోని ఓ హోటల్లో ఉంటుండటంతో అతని వద్దకు పంపించేందుకు ప్రయత్నించారు. అప్పుడు ఆమె రెండురోజుల క్రితం తప్పించుకుంది. బంధువులు, మహిళా సంఘాల సాయంతో రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications