సోదరుడి వరుస వ్యక్తితో ప్రేమ, హత్య చేసిన పేరెంట్స్

ఇంటర్ విద్యార్థిని బానోతు సరిత(16) అదే తండాలోని వరుసకు పెదనాన్న కుమారుడు బానోత్ రాం సింగ్ (27)తో ప్రేమలో పడింది. వీరి ఇద్దరి తాతలు అన్నదమ్ములు, ఒకే ఇంటిపేరు కావడంతో ఇరు కుటుంబాల వారు వారిని తీవ్రంగా మందలించారు. అయితే పెద్దల మాటను పట్టించుకోకుండా ఆ ఇద్దరు మహబూబాబాద్ ఎస్డీపీవో రమాదేవిని ఆశ్రయించారు.
సరిత మైనర్ కావడంతో వరంగల్‌లోని హోమ్‌కు పంపి, రాంసింగ్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. జైలు నుంచి విడుదలైన తరువాత రాంసింగ్ హైదరాబాద్ చేరి సరితతో ఫోన్‌లో ప్రేమాయణం కొనసాగించాడు. కొద్ది కాలం తరువాత సరిత రాంసింగ్ వద్దకు చేరింది. దాంతో సరిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీరోలు ఎస్సై సాంబయ్య శనివారం సాయంత్రం సరితను హైదరాబాద్ నుంచి రప్పించి ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. సరిత తమ పరువు తీస్తోందని భావించిన తల్లిదండ్రులు బానోత్ భద్రు, తారిలు అర్ధరాత్రి దాటిన తరువాత కన్న కుమార్తె మెడకు తాడు బిగించి హతమార్చారు.
అనంతరం ఒక కొక్కానికి చున్నీతో సరితను బిగించి ఆత్మహత్య చేసుకుందన్నారు. డీఎస్పీ రమాదేవి ఘటనా స్థలానికి వచ్చి విచారించడంతో అసలు విషయం బయటపడింది. సరిత తల్లిదండ్రులతో పాటు ఆమె తమ్ముడు రాజును అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications