వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ నేతలకు, పోలీసులకు పరిటాల శ్రీరామ్ వార్నింగ్ .. అనంతపురంలో పొలిటికల్ హీట్

|
Google Oneindia TeluguNews

అనంతపురం రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అనంతపురం జిల్లాలో వైసిపి నేతల తీరుపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా వైసిపి నేతలపై మంత్రి పరిటాల సునీత తనయుడు, టిడిపి నేత పరిటాల శ్రీరామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలపై వైసీపీ నేతలు కావాలని తప్పుడు కేసులు పెట్టిస్తున్నారంటూ మండిపడ్డారు.

వీఓఏ ఆత్మహత్య; వైసీపీ నాయకుడి వేధింపులు; పోలీసులు స్పందించకపోవడం దారుణం: చంద్రబాబువీఓఏ ఆత్మహత్య; వైసీపీ నాయకుడి వేధింపులు; పోలీసులు స్పందించకపోవడం దారుణం: చంద్రబాబు

 పోలీసులు వైసీపీ నేతలు చెప్పినట్లు వ్యవహరిస్తున్నారు: పరిటాల శ్రీరామ్

పోలీసులు వైసీపీ నేతలు చెప్పినట్లు వ్యవహరిస్తున్నారు: పరిటాల శ్రీరామ్


పోలీస్ కేసులు పెడితే, మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఊరుకునేది లేదని పరిటాల శ్రీరామ్ హెచ్చరికలు జారీ చేశారు. వైసిపి నేతల అవినీతిని, వైసిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనను ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా?సామాజిక మాధ్యమాల్లో పోస్టును షేర్ చేసినందుకు ఉదయం 5 గంటల సమయంలో రాప్తాడు మండల ఎస్సీ సెల్ అధ్యక్షున్ని అరెస్టు చేయాల్సిన అవసరం పోలీసులకు ఏముంది, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేదా? ఇది రాజరికమా ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించిన పరిటాల శ్రీరామ్, పోలీసులు వైసీపీ నేతలు చెప్పినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ఎమ్మెల్యేను కించపరిచే పోస్ట్ పెట్టారని అనుమానం .. టీడీపీ నేత అన్యాయంగా అరెస్ట్

ఎమ్మెల్యేను కించపరిచే పోస్ట్ పెట్టారని అనుమానం .. టీడీపీ నేత అన్యాయంగా అరెస్ట్


సోషల్ మీడియాలో ఎమ్మెల్యేను కించపరిచినట్టు ప్రచారం చేశారన్న అనుమానంతో మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు ముత్యాలప్పను పోలీసులు అరెస్ట్ చేసి తరలించడం పై పరిటాల శ్రీరామ్ మండిపడ్డారు. తప్పు చేయకున్నా అరెస్టు చేస్తే ప్రైవేటు కేసు పెట్టాల్సి వస్తుందని పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారు. దళితులపై దాడులు, భూకబ్జాలు ఎక్కువగా జరుగుతున్నా పోలీసులు స్పందించటం లేదని పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు.

పోలీసులకు పరిటాల శ్రీరామ్ వార్నింగ్

పోలీసులకు పరిటాల శ్రీరామ్ వార్నింగ్


ఎవరైతే తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉంటారో వారిపైన కచ్చితంగా దాడులు జరుగుతున్నాయని పరిటాల శ్రీరామ్ ఆరోపించారు. ఎవరైనా వ్యక్తిని అరెస్టు చేయాలంటే ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని, కానీ అలా కాకుండా ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. పోలీసులు చట్టం ప్రకారం నడుచుకోవాలని, లేకపోతే తాము కూడా న్యాయపోరాటం చేయాల్సి వస్తుంది అంటూ హెచ్చరించారు. పోలీసులు చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే తెలుగుదేశం పార్టీ నాయకులుగా తాము హైకోర్టుకు వెళ్తామని పేర్కొన్నారు.

 ప్రతి కార్యకర్త వెంట తానుంటాను: పరిటాల శ్రీరామ్

ప్రతి కార్యకర్త వెంట తానుంటాను: పరిటాల శ్రీరామ్


కొందరు వైసీపీ నాయకుల తీరు వల్ల సొంత పార్టీ నేతలు కూడా ఇబ్బంది పడుతున్నారని, అలాంటి వారికి కూడా తాము అండగా ఉంటామని పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. టీడీపీ నేతలపై పెడుతున్న కేసులపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసిన ఆయన ఇది మంచిపద్దతి కాదని హితవు పలికారు.. అరెస్టయిన ముత్యాలును రాప్తాడు పార్టీ కార్యాలయంలో పరామర్శించి, ధైర్యంగా ఉండమని ధైర్యం చెప్పానని పేర్కొన్న ఆయనప్రతి కార్యకర్త వెంట నేనుంటాను.. నేను నడుస్తాను.. అని స్పష్టం చేశారు.

English summary
Paritala Sriram was incensed that the police were acting as told by the YSRCP leaders and apparently arresting the TDP leaders. Paritala sriram warning to the police and YSRCP leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X