జగన్! ఇంకేమీ కనిపించడం లేదా: పరిటాల సునీత, ఇదీ వైసీపీ: కోడెల కొడుకు ఆగ్రహం

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి/అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి పరిటాల సునీత శుక్రవారం మండిపడ్డారు. జగన్‌కు కుర్చీ తప్ప ఇంకేమీ కనిపించడం లేదని విమర్శలు గుప్పించారు.

  YS Jagan padayatra : బీసీలకు అండగా ఉంటా, బాబు లా మోసం చెయ్యను !

  ఆమె రాప్తాడులో రుణమాఫీ పరిష్కార వేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు రుణపత్రాలను పరిశీలించి, అర్హులైన వారికి డబ్బులు అందించారు. ఈ సందర్భంగా ఆమె ప్రతిపక్ష నేత పైన విరుచుకుపడ్డారు.

  'స్వరం మార్చిన రోజా, జగన్‌కు ఇబ్బందులు మొదలు, రాత్రుళ్లు మాట్లాడుకుంటున్నారు'

  జగన్‌కు పదవి తప్ప ఏదీ కనిపించట్లేదు

  జగన్‌కు పదవి తప్ప ఏదీ కనిపించట్లేదు

  వైయస్ జగన్ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని పరిటాల సునీత అన్నారు. ప్రభుత్వంపై అర్థంలేని విమర్శలు, అబద్దాలు చెప్పడమే ఆయన పనిగా పెట్టుకున్నారని చెప్పారు. జగన్‌కు పదవి తప్ప మరేమీ కనిపించడం లేదని విమర్శించారు.

  అధికార దాహం పట్టుకుంది, జగన్ మాటలు నమ్మరు

  అధికార దాహం పట్టుకుంది, జగన్ మాటలు నమ్మరు

  వైయస్ జగన్మోహన్ రెడ్డికి అధికార దాహం పట్టుకున్నదని పరిటాల సునీత విమర్శించారు. అందుకే ఆచరణ సాధ్యం హామీలను ఇస్తున్నారని విమర్శించారు. జగన్ ఏం చెప్పినా ప్రజలు నమ్మడం లేదని చెప్పారు.

  వైసీపీ మసకబారుతోంది

  వైసీపీ మసకబారుతోంది

  వైయస్ జగన్మోహన్ రెడ్డిపై స్పీకర్ కోడెల శివప్రసాద రావు తనయుడు కోడెల శివరాం కూడా అంతకుముందు వేరుగా ధ్వజమెత్తారు. వైసీపీ పరిస్థితి రోజు రోజుకు మసకబారుతోందని చెప్పారు. అందుకే అబద్దాలు చెప్పి బలం పెంచుకోవాలని చూసుకుంటున్నారని విమర్శించారు.

  జేసీ దుమారం, ఇక అంతేనా?: బాబు పక్కా ప్లాన్, మోడీపై ఆగ్రహంతోనే గుజరాత్‌కు దూరం

  తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని, విషం చిమ్మితే నమ్మరు

  తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని, విషం చిమ్మితే నమ్మరు

  తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్ సాగించిన అవినీతి, అరాచకాలను ప్రజలు మర్చిపోలేదని కోడెల శివరాం అన్నారు. ఇప్పుడు పాదయాత్రలో ప్రజలను ఉద్దరిస్తానంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినా ప్రజలు నమ్మరని చెప్పారు. ప్రభుత్వంపై విషం చిమ్ముతూ సొంత మీడియాలో కట్టుకథలు రాసినా వృథా ప్రయాసే అన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Minister Paritala Sunitha and Kodela Siva Prasad Rao's son Kodela Sivaram on YSRCP chief YS Jagan Mohan Reddy.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి