వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీ ఓటమి , స్థానిక సంస్థల ఎన్నికలపై నేటి నుండి జనసేన సమీక్షలు .. పార్టీ భవిష్యత్ ఎలా ఉండబోతుందో ?

|
Google Oneindia TeluguNews

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ప్రభంజనం కాదు కదా ప్రభావం చూపలేకపోయింది. మొత్తం 175 స్థానాల్లో కేవలం ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పతి అధినేత పవన్ కళ్యాన్ కూడా రెండు చోట్ల పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినా సరే తన జీవితం ప్రజా సేవకే అంకితం అనీ ప్రకటించారు పవన్ కళ్యాణ్.ఇక ఇప్పుడిప్పుడే పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్న పవన్ కళ్యాణ్ పార్టీ ఓటమిపై, అలాగే ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుండటంతో వాటిపై దృష్టి పెట్టనునారు.

ఈ నేపధ్యంలో ఆయన సమీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. డిపోయిన అభ్యర్థుల ఓటమికి కారణాలను, ప్రతి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు వచ్చిందీ నివేదికలు తీసుకురమ్మని అభ్యర్థులకు చెప్పిన పవన్ కళ్యాణ్ ఈరోజు నుంచీ మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో చర్చించటానికి అందరికీ పిలుపునిచ్చారు.

కేంద్ర మంత్రి హోదాలో తెలంగాణాకు తొలిసారిగా కిషన్ రెడ్డి రాక .. ఘనంగా స్వాగతం పలుకనున్న బీజేపీకేంద్ర మంత్రి హోదాలో తెలంగాణాకు తొలిసారిగా కిషన్ రెడ్డి రాక .. ఘనంగా స్వాగతం పలుకనున్న బీజేపీ

ఓటమికి గల కారణాలను , స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై నేడు జనసేన సమీక్ష

ఓటమికి గల కారణాలను , స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై నేడు జనసేన సమీక్ష

ఇక నేటి నుండి జరగనున్న సమీక్షల్లో ఓటమికి గల కారణాలను నియోజక వర్గాల వారీగా సమీక్షించనున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న తరుణంలో వాటిని ఎలా ఎదుర్కోవాలి అన్న అంశంపై కూడా చర్చించనున్నారు. ఇప్పుడు ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటై కొద్ది రోజులే అవుతుంది కాబట్టి ప్రజల్లో పాలక ప్రభుత్వం మీదే విశ్వాసం ఉంటుందని భావిస్తున్న నేపధ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తే ఎలా వుంటుంది అన్న అంశంపై ప్రధానంగా చర్చ సాగనుంది. అంతే కాదు పార్టీని ఎలా బలోపేతం చెయ్యాలి, ఏ ఏరియాలో పార్టీ బాగా వీక్ గా ఉంది అన్న అంశంపై కూడా జనసేన అధ్యయనం చేస్తుంది. పబ్లిసిటీలో వెనకబడి ఉన్నామని గమనించి అందుకే పత్రిక పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్.

నేడు ఓటమి పాలైన అందరు అభ్యర్థులతో జనసేనాని భేటీ .. పార్టీ బలాబలాలు తేల్చుకునే పనిలో పవన

నేడు ఓటమి పాలైన అందరు అభ్యర్థులతో జనసేనాని భేటీ .. పార్టీ బలాబలాలు తేల్చుకునే పనిలో పవన

ఇక జనసేన ఏపీ ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితం అయినా , 16 లక్షల ఓట్లు సాధించిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఎవరినీ ప్రలోభాపెత్తకుండా డబ్బులేవీ పంచకుండా, మద్యం వంటివి ఇవ్వకుండా సాధించిన ఓట్లు కాబట్టి అవి చాలా విలువైన ఓట్లు అని భావిస్తున్నారు జనసైన్యం. ప్రజాభిమానంతో వేసిన ఈ ఓట్లు , జనసేన మీద విశ్వాసంతో వేసిన ఈ ఓట్లు తమకు ఎంతో స్పూర్తిని ఇస్తున్నాయని వారంటున్నారు. ఈ పరిస్థితులపై నేటి నుంచీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అభ్యర్థులతో పవన్ సమీక్షలు నిర్వహించనున్నారు. ఇక నేడు ఉండి నియోజకవర్గం నుంచీ సీపీఎం అభ్యర్థులు,కొవ్వూరు, గోపాలపురం నియోజక వర్గాల నుంచీ బీఎస్పీ, 12 నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థుల్ని సమీక్షలకు పిలిచారు పవన్ కళ్యాణ్.

పార్టీ భవిష్యత్ ఎలా ఉండబోతుందో.. ఇప్పటికైనా జనసేన పంధా మారుతుందా ?

పార్టీ భవిష్యత్ ఎలా ఉండబోతుందో.. ఇప్పటికైనా జనసేన పంధా మారుతుందా ?

నేడు జరగనున్న సమీక్షల్లో ఓటమికి గల కారణాలను అన్వేషించి పార్టీ బలోపేతం చెయ్యటానికి ఎలాంటి చర్యలు అవసరం అవుతాయో ఆ నిర్ణయాలు తీసుకునేందుకు జనసేన సిద్ధంగా ఉంది. పార్టీ బలాలను, బలహీనతలను బేరీజు వేసుకుని క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలన్న దానిపై చర్చించనున్నారు. అలాగే 2024 ఎన్నికలకు మరింత జోష్ తో సిద్ధం కావాలనే ఆలోచనలో ఉంది జనసేన పార్టీ . ఇకముందు పార్టీ భవిష్యత్ ఎలా ఉండబోతుందో.. ఇప్పటికైనా జనసేన పంధా మారుతుందా అన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతుంది.

English summary
From today onwards pavan kalyan is going to start review meetings in constituency wise . The reasons for the defeat and It will also discuss the issue of how to tackle the up coming local bodies election. Now that the new government formed in the AP, it will be a matter of time before the ruling party will have confidence in the local bodies.It is not just about how to strengthen the party, but also in the area where the party is weak. and to plan in a proper way to strenghthen the Janasena party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X