వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైల్వేల కీలక నిర్ణయం-పలు పాసింజర్ రైళ్ల రద్దు-బొగ్గు రవాణాకు అడ్డు రాకుండా

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా బొగ్గు కొరతతో విద్యుత్ సంక్షోభం అలుముకుంటోంది. మరోవైపు రైల్వేలు ఉన్న బొగ్గును సైతం సకాలంలో వివిధ రాష్ట్రాలకు రవాణా చేయలేకపోతున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బొగ్గు రవాణా సాఫీగా సాగేలా ఈ నిర్ణయం ఉపకరించనుంది.

విద్యుత్ సంక్షోభాన్ని నివారించేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రం రైల్వే వ్యాగన్లను వేగంగా ప్రయాణించేలా చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో పవర్ ప్లాంట్‌లలో క్షీణిస్తున్న నిల్వలను తిరిగి నింపడానికి ఎదురవుతున్న ఇబ్బందుల్ని పరిష్కరించేందుకు బొగ్గు క్యారేజీల్ని వేగంగా రవాణా అయ్యేలా రైల్వేశాఖ కొన్ని ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది.
ఈ చర్య తాత్కాలికమేనని, పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన వెంటనే ప్రయాణీకుల సేవలు పునరుద్ధరిస్తాయని
ఇండియన్ రైల్వేస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గౌరవ్ కృష్ణ బన్సాల్ తెలిపారు. విద్యుత్ ప్లాంట్‌లకు బొగ్గును తరలించడానికి పట్టే సమయాన్ని తగ్గించడానికి రాష్ట్ర ఆపరేటర్ ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు.

passenger trains cancellations to make way for coal transport amid power crisis in india

వాస్తవానికి బొగ్గు సరఫరాలో అంతరాయాలకు రైల్వేశాఖ విమర్శలు ఎదుర్కొంటోంది. క్యారేజీలు లేకపోవడం వల్ల ఎక్కువ దూరాలకు ఇంధనాన్ని తీసుకెళ్లడం కష్టమవుతోంది. రద్దీగా ఉండే మార్గాలు, ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు ప్రయాణం కోసం తంటాలు పడుతున్నాయి. కొన్నిసార్లు సరుకులు ఆలస్యం అవుతున్నాయి. అయినప్పటికీ, క్యారియర్ బొగ్గును రవాణా చేయడానికే రైల్వే ప్రాధాన్యమిస్తోంది. ముఖ్యంగా గనులకు దూరంగా ఉన్న వినియోగదారులకు బొగ్గు రవాణాపై రైల్వే దృష్టిసారిస్తోంది.

దేశంలో మండు వేసవిలో బొగ్గు డిమాండ్‌ పెరుగుతోంది. ప్రస్తుంత దేశంలోని 70% విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంలో బొగ్గుదే కీలక పాత్ర. దేశంలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ కోతలు తీవ్రమవుతున్నాయి. కొన్ని పరిశ్రమలు ఇంధనం కొరత కారణంగా ఉత్పత్తిని తగ్గించాయి. కోవిడ్ తిరోగమనం నుంచి ఆర్థిక వ్యవస్థ యొక్క పునరుద్ధరణపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి ఆజ్యం పోసిన అధిక ఇంధన ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం ఇబ్బందులు పడుతున్న సమయంలో ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం పొంచి ఉంది.

English summary
indian railways has cancelled several passenger trains to make way for coal transport amid power crisis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X