అమ్మాయిపై పాస్టర్ రేప్: భర్త మృతితో ఆగిన గుండె

Pastor abuses girl in Vijayanagaram district
విజయనగరం/ నల్లగొండ: విజయనగరం జిల్లా శృంగవరపుకోట శివారు రేగ పుణ్యగిరి చర్చి పాస్టర్ బి.ప్రసాదరావు అలియాస్ జోసఫ్ (27) ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విశాఖపట్నం జిల్లా హుకుంపేటకు చెందిన జోసప్ ఎస్.కోట పరిసర ప్రాంతాల్లో క్రైస్తవ బోధనలు చేస్తుంటాడు. ఇతడికి పెళ్లయినా, కుటుంబ తగాదాల వల్ల దంపతులు విడిగా ఉంటున్నారు.

బోధనలకు వెళ్లే సమయంలో ఎస్.కోటలో 15 ఏళ్ల బాలికతో పరిచయం పెంచుకుని మాయమాటలు చెప్పాడు. గత నెల 2న రేగ పుణ్యగిరిలో ఆ బాలికను లొంగదీసుకున్నాడు. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి బాధిత బాలిక మౌనంగా, ఒంటరిగా ఉంటోంది. ఇది గమనించిన పాఠశాల ఉపాధ్యాయురాలు ఆమెను నిలదీయగా అసలు విషయం బయటపెట్టింది. దీంతో ఉపాధ్యా యురాలు చైల్డ్‌లైన్ సభ్యులకు సమాచారమందించారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నల్లగొండ జిల్లా, కోదాడ మండలం కూచిపూడి గ్రామానికి కలకొండ సత్యనారాయణ (58) ఆదివారం ఆర్ధరాత్రి గుండెపోటుతో మరణించారు. దీంతో తీవ్రంగా కలతచెందిన అతని భార్య అనసూర్యమ్మ (53) భర్త మృతదేహం వద్దనే విలపిస్తూ సోమవారం ఉదయం కుప్పకూలింది.

బంధువులు ఆమెను ఆసుపత్రికి తరలించే లోపే తుది శ్వాస విడిచింది. దీంతో వారిద్దరికీ ఒకేసారి అంత్యక్రియాలు నిర్వహించారు. ముగ్గురు కుమార్తెలకు వివాహం చేసిన అనంతరం ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సత్యనారాయణ ఓ పరిశ్రమలో రోజు వారి కూలీగా పనిచేస్తుండగా, అనసూర్యమ్మ వ్యవసాయ కూలీ పనులకు వెళుతుందని బంధువులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+