కాకినాడలో దారుణం: మనస్తాపంతో ఆసుపత్రిలో ఉరేసుకుని రోగి ఆత్మహత్య

అమరావతి: ఆపరేషన్ చేయడం లేదన్న కారణంతో ఓ రోగి ఆసుపత్రిలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో కలకలం సృష్టించింది. ఈ సంఘటన కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

శుక్రవారం ఉదయం తెల్లవారుజూమున నాలుగు గంటల ప్రాంతంలో సతీష్ అనే రోగి సర్జరికల్ వార్డులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొన్నాళ్లుగా లివర్, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న రోగి సతీష్ జులై నెలలో చికిత్స కోసం కాకినాడు ప్రభుత్వాసుపత్రిలో చేరాడు.

అయితే సతీష్‌కు ఇప్పటికే ఆసుపత్రి వైద్యులు మొదటి చికిత్స చేశారు. తన రోగం పూర్తిగా నయం కావాలంటే ఆపరేష‌న్‌ను చేయాల్సిందేనని గత కొన్ని రోజులుగా వేడుకుంటున్నాడు. అయితే వైద్యులు అతడికి ఆపరేషన్ చేయడంలో కాస్తంత ఆలస్యం చేస్తూ వస్తున్నారు.

Patient suicide attempt in kakinada general hospital

దీంతో తనకు సరిగా చికిత్స అందడం లేదనే మనస్తాపంతో పెద్ద సంఖ్యలో సిబ్బంది తిరిగే ప్రాంతంలో సతీష్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆసుపత్రిలో శుక్రవారం కలకలం రేగింది. అయితే ఆసుపత్రి వైద్యులు మాత్రం తాము ఆపరేషన్ చేయమని చెప్పలేదని అంటున్నారు.

కర్రతో మహిళను కొట్టి చంపిన వ్యక్తి

కృష్ణా జిల్లా పెడన మండలం కూడూరులో దారుణం చోటు చేసుకుంది. లక్ష్మీ అనే మహిళను నాగేశ్వరరావు అనే వ్యక్తి కొట్టి చంపాడు. కొన్ని రోజుల క్రితం మృతి చెందిన తన భర్త చావుకు నాగేశ్వరరావే కారణమంటూ లక్ష్మీ ఆరోపిస్తుంది. దీంతో కోపంతో నాగేశ్వరరావు లక్ష్మీని కొట్టి చంపాడని స్థానికులు చెప్పారు.

ఆర్టీసీ బస్సుని ఢీకొన్న విద్యుత్ స్తంభం: ఒకరి మృతి

నెల్లూరు జిల్లాలోని పెళ్లకూరు మండలం చిల్లకూరు వద్ద జాతీయ రహదారిపై కాకినాడ డిపోకు చెందిన ఆర్టీసీ గరుడ బస్సు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటనలో రోడ్డు దాటుతున్న పద్మయ్య (35) అనే యువకుడు అక్కడికక్కడే మరణించాడు.

ఈ ప్రమాదంలో డ్రైవరు శ్రీనివాసులు గాయపడ్డాడు. గాయపడ్డ డ్రైవర్‌ను తిరుపతి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాకినాడ నుంచి బెంగుళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులను వేరే బస్సు ద్వారా గమ్యస్థానాలకు తరిలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+