వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామ్‌గోపాల్‌ వర్మకు దశదిన ఖర్మ.. పవన్ కళ్యాణ్ పై ఆగని వర్మ వ్యాఖ్యల వివాదం!!

|
Google Oneindia TeluguNews

చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ భేటీ రాజకీయ వర్గాల్లో మాటల యుద్ధానికి కారణం కాగా, ఈ వ్యవహారంలో కాంట్రవర్సీలకు కేరాఫ్ అయిన రాంగోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దుమారంగా మారింది. పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు డబ్బు కోసం తన సొంత కాపుల్ని కమ్మోళ్ళకి అమ్మేస్తాడని ఊహించలేదు.. రెస్ట్ ఇన్ పీస్ కాపులు.. కంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్ళు అంటూ రాంగోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ద్వారా ఆయన పవన్ కళ్యాణ్ ను, చంద్రబాబును టార్గెట్ చేశారు.

అక్కడితో ఆగని రాంగోపాల్ వర్మ జనసేన నేతలు, తెలుగుదేశం పార్టీ నేతలు వర్మ తీరును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నా, తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నా ఏమాత్రం మారలేదు. మళ్లీ మరో మారు సంచలన ట్వీట్లతో రచ్చ చేస్తున్నారు. తాజాగా మరోమారు రాంగోపాల్ వర్మ కాపులు - కాపులు x కాపులు + కమ్మోళ్ళు ÷ సేనలు - సేనలు ఇస్ నాట్ = ఓట్లు అంటూ ట్వీట్ చేశారు.

Pawan fans targets ram gopal varma with new protest over varma tweets on Pawan Kalyan

ఇక రాంగోపాల్ వర్మ ట్వీట్ పై టిడిపి, జనసేన నాయకులు అగ్ని మీద గుగ్గిలం అవుతున్నారు. రాంగోపాల్ వర్మ వ్యవహారాలను ఏకి పారేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా రాంగోపాల్ వర్మను టార్గెట్ చేస్తున్నారు. నైతిక విలువలు లేని వాళ్ళు కూడా మాట్లాడే వాళ్ళా అని ప్రశ్నిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పవన్ కళ్యాణ్ అభిమానులు రాంగోపాల్ వర్మ కు దశదినకర్మ నిర్వహించారు.

వర్మ చనిపోయారు అని వర్మ ఫోటో ఉన్న పోస్టర్ కు పూలమాల వేసి జనాలకు అన్నసంతర్పణ చేశారు. రాంగోపాల్ వర్మ తీరుపై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలోనూ విరుచుకుపడుతున్నారు. అషు రెడ్డి కాళ్ళు నాకిన రాంగోపాల్ వర్మ తీరును ఎండగడుతున్నారు. కామంతో కాళ్లు నాకావు.. పేటీఎం డబ్బుల కోసం ఏమైనా నాకుతావ్ అంటూ తీవ్ర పదజాలంతో జనసేన నేతలు, టిడిపి నాయకులు రాంగోపాల్ వర్మను టార్గెట్ చేస్తున్నారు.

English summary
Pawan Kalyan's fans targets Ram Gopal Varma with new protest doing his 10th day death ceremony. Janasena and TDP leaders are targeting Varma in the context of the controversy over Varma's comments on Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X