వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను ప్రధానిని కలవాలా? మీరేం చేస్తారు?: యువత రోడ్లపైకే అంటూ హెచ్చరిక, అయ్యన్నకు కౌంటర్

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

ఎన్నికల సమయంలో వేదిక పంచుకున్న తనను ప్రధాని నరేంద్ర మోడీని కలిసి మాట్లాడమంటున్నారు కానీ, పార్లమెంటులో ప్రధాని పక్కనే కూర్చుండే మీ ఎంపీలు ఏం చేస్తున్నారని అయ్యన్నపాత్రుడిని పవన్ నిలదీశారు. మీడియా ముందుకు వచ్చి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వదని చెప్పడం తప్ప వారేం చేస్తున్నారని ప్రశ్నించారు.

Pawan fires at Ayyanna patrudu

ప్రత్యేక హోదా ఇస్తారో ఇవ్వరో తర్వాత సంగతి కానీ, ప్రజల అసంతృప్తిని కేంద్రానికి చెప్పడానికే భయపడితే ఎలా అంటూ నిలదీశారు. ఏపీ ప్రజలు ప్రత్యేక హోదాను కోరుతున్నారని, ఆంధ్రులు ఈ దేశ ప్రజలేనని పవన్ అన్నారు. కేంద్రంలో ఉండే నేతలు పార్టీలకు బానిసలు కాదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మీరు కేంద్రం వద్ద ప్రజల అసంతృప్తిని తెలియజేయకపోతే రాష్ట్ర యువత రోడ్ల మీదకు వస్తుందని హెచ్చరించారు. మీరు ఏమీ చేయకండి.. యువతను ఏమీ చెయ్యనీకండి. మరి దీనికి పరిష్కారం ఏమిటి? అంటూ పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని నిలదీశారు.

English summary
Janasena president Pawan Kalyan on Tuesday fired at Andhra Pradesh minister Ayyanna patrudu for special status.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X