మూడో భార్యతో విడాకులపై ఒక్క ఫొటోతో సమాధానం ఇచ్చిన పవన్ కల్యాణ్..!!

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన మూడో భార్య అన్నా లెజ్నెవాకు విడాకులు ఇవ్వబోతోన్నారనే వార్తలు ఇవ్వాళ హల్‌చల్ చేశాయి. దాదాపు అన్ని మీడియా హౌస్‌లు కూడా దీన్ని కవర్ చేశాయి. దీనికి సంబంధించిన వివరాలన్నింటినీ వెల్లడించాయి. తన మూడో భార్య లెజ్నెవాతో విడాకుల కోసం దరఖాస్తు చేయడానికి సిద్ధపడుతున్నారనేది ఆ వార్తల సారాంశం.

పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ఆయన రాజకీయంగా కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు. తొలి భార్య నందిని, రెండో భార్య, నటి రేణూ దేశాయ్‌తో పవన్ కల్యాన్ విడిపోయారు. విడాకులు తీసుకున్నారు. రష్యాకు చెందిన డాన్సర్ అన్నా లెజ్నెవాను మూడో పెళ్లి చేసుకున్నారు. లెజ్నెవాకు కూడా విడాకులు ఇవ్వబోతోన్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

Pawan Kalyan and his wife Anna Lezhneva participated in Pooja at his Hyderabads residence

ఈ వార్తలకు పవన్ కల్యాణ్ చెక్ పెట్టారు. ఒకే ఒక్క ఫొటోతో ఈ విమర్శలు, ఆరోపణలకూ సమాధానం ఇచ్చారు. ఇవ్వాళ హైదరాబాద్‌లోని తన నివాసంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు పవన్ కల్యాణ్. భార్య లెజ్నెవాతో కలిసి ఇందులో పాల్గొన్నారు. హిందూ సంప్రదాయబద్ధంగా ఈ పూజలను జరిపించారు. ఇవ్వాళ ఆయన నివాసం మొత్తం వేదమంత్రోచ్ఛారణలతో మారుమోగింది.

వారాహి విజయ యాత్ర తొలి దశ విజయవంతంగా ముగిసిన సందర్భాన్ని పరస్కరించుకుని పవన్ కల్యాణ్ ఈ ప్రత్యేక పూజలను నిర్వహించారు. మలిదశ వారాహి విజయ యాత్ర కూడా దిగ్విజయం కావాలని ఆశిస్తూ పవన్ కల్యాణ్ సంకల్పం తీసుకున్నారు. త్వరలో మలిదశ వారాహి విజయ యాత్ర ఆరంభం కానుంది.

దీనికి సంబంధించిన సన్నాహక సమావేశాల్లో పాల్గొనడానికి ఆయన త్వరలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు. మలిదశ రూట్ మ్యాప్‌ను సిద్ధం చేయడంపై చర్చలు కొనసాగిస్తారు. పార్టీ రాజకీయ వ్వవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సహా పలువురు నాయకులు ఇందులో పాల్గొంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+