జనసేనకు 24 -3, పవన్ పోటీ పై సస్పెన్స్ - 5 మంది అభ్యర్దుల ప్రకటన..!!

ఎట్టకేలకు పొత్తులో జనసేనకు కేటాయించే సీట్లపై స్పష్టత వచ్చింది. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా 24 ఎమ్మెల్యే, 3 ఎంపీ సట్లు పవన్ పార్టీకి ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే రెండు పార్టీల అభ్యర్దుల ను చంద్రాబాబు, పవన్ ఖరారు చేసారు. 118 సీట్లతో టీడీపీ జనసేన తొలి జాబితా విడుదల చేసారు. తొలి జాబితాలో 94 మంది టీడీపీ అభ్యర్థుల ప్రకటన చేసారు. 24 సీట్లు ఖరారు కాగా, 5 మంది అభ్యర్దులను పవన్ ప్రకటించారు. పవన్ పోటీ పైన ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.

జనసేనకు సీట్లు ఖరారు : టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా 118 స్థానాల అభ్యర్దులు ఖరారయ్యారు. జనసేన పొత్తులో భాగంగా మెజార్టీ సీట్లు దక్కించుకోవాలనే ఒత్తిడి కొంత కాలంగా కొనసాగుతోంది. దీనికి సంబంధించి అధికారికంగా నిర్ణయం ప్రకటించారు. జనసేనకు పొత్తులో భాగంగా 3 ఎంపీ స్థానాలు, 24 ఎమ్మెల్యే స్థానాలు ఖరారయ్యాయి. అందులో అయిదు స్థానాల అభ్యర్దులను పవన్ ప్రకటించారు. టీడీపీ నుంచి 94 స్థానాలకు అభ్యర్దుల ను ప్రకటించగా..బీజేపీతో పొత్తు పైన స్పష్టత తరువాత మిగిలిన స్థానాల్లో అభ్యర్దులను ప్రకటిస్తామని ఇరు పార్టీల నేతలు స్పష్టం చేసారు.

Pawan Kalyan Annouces Janasena will contest for 23 MLA and 3 MP seats as Alliance agreement

అభ్యర్దుల ప్రకటన : జనసేన అభ్యర్దులుగా అనకాపల్లి - కొణతాల రామకృష్ణ, రాజానగరం - బల రామకృష్ణుడు, కాకినాడ రూరల్ - నానాజీ,తెనాలి - నాదెండ్ల మనోహర్ అభ్యర్దులుగా ప్రకటించారు. ఇదే సమయంలో పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగినా ఆ సీటు ఈ జాబితాలో లేదు. పవన్ భీమవరం నుంచే పోటీ చేస్తున్నారా..ఆలోచన మారిందా అనే చర్చ మొదలైంది. అయితే, జనసేన నుంచి ఇంకా 19 స్థానాలకు అభ్యర్దులను ఖరారు చేయాల్సి ఉంది. అభ్యర్దుల ప్రకటన విషయంలో పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. సిద్దం అని వైసీపీ జగన్ అంటున్నారని.. తాము యుద్దానికి సంసిద్ధం రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉండటానికి మేం ఇది చేస్తున్నామని పవన్ చెప్పుకొచ్చారు.

Pawan Kalyan Annouces Janasena will contest for 23 MLA and 3 MP seats as Alliance agreement

పవన్ కీలక వ్యాఖ్యలు : చాలా మంది 60 లేదా 70 సీట్లలో పోటీ చేయాలని అన్నారని పవన్ వ్యాఖ్యానించారు. గతంలో 10 సీట్లు గెలిచి ఉండుంటే అడగటానికి ఉండేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు సీట్ల సంఖ్య ముఖ్యం కాదని పవన్ తేల్చి చెప్పారు. పరిమిత సంఖ్యలో పోటీ చేసి స్ట్రైక్ రేట్ గెలుపు లో చూపించాలని సూచించారు.

బీజేపీకి సీట్లు ఇచ్చే క్రమంలో మేము సీట్లు తగ్గించు కుంటున్నామని పవన్ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. జనసేన కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక స్థానం ఉంటుందని హామీ ఇచ్చారు. బీజేపీతో పొత్తు పైన స్పష్టత వచ్చిన తరువాత సీట్ల పైన తుది నిర్ణయం ఉండే అవకాశం ఉందని ఇరు పార్టీల నేతలు స్పష్టం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+