వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీపై పవన్ కళ్యాణ్ దాడి: అంతా తేలిపోయింది, పక్కా ప్లాన్?

పవన్ కళ్యాణ్ విమర్శలకు చెక్ చెబుతారా? అసలు రూట్లోకి వచ్చారా? అనే చర్చ సాగుతోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి - బిజెపి కూటమికి మద్దతుగా నిలిచిన పవన్ ఆ తర్వాత సమస్యలపై పలుమార్లు స్పందించారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విమర్శలకు చెక్ చెబుతారా? అసలు రూట్లోకి వచ్చారా? అనే చర్చ సాగుతోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి - బిజెపి కూటమికి మద్దతుగా నిలిచిన పవన్ ఆ తర్వాత సమస్యలపై పలుమార్లు స్పందించారు.

బీజేపీకి సవాల్ విసిరిన పవన్ కళ్యాణ్బీజేపీకి సవాల్ విసిరిన పవన్ కళ్యాణ్

అయితే, ఆయన ఎప్పుడూ ఇలా వచ్చి అలా వెళ్లడమే తప్ప చేసిందేమీ లేదనే విమర్శలు ఉన్నాయి. కానీ గత రెండు మూడు నెలలుగా పవన్ తీరులో కొంత మార్పు కనిపిస్తోందని అంటున్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న పవన్.. ఇటీవల వరుసగా ప్రజా సమస్యల పైన స్పందిస్తున్నారు.

ఏపీలో ప్రత్యేక హోదా పైన గత రెండు మూడు నెలలుగా వరుసగా సభలు పెడుతున్నారు. తద్వారా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీలో జనసేన బలోపేతానికి కృషి ప్రయత్నిస్తున్నారు.

pawan kalyan

ఏ పార్టీకి మద్దతిచ్చారో అదే పార్టీపై ఆగ్రహం

మరోవైపు, ప్రధానంగా ఆయన 2014 ఎన్నికల్లో ఏ పార్టీకి అయితే అండగా నిలబడ్డారో అదే బీజేపీ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి అంశం నుంచి కేంద్రస్థాయి అంశం వరకు ఆయన నిలదీస్తున్నారు.

గురువారం నాడు కేంద్రంలోని బీజేపీ హయాంలోని ఐదు సమస్యల పైన స్పందిస్తానని చెప్పారు. అందులో భాగంగా గురువారం గో వధ పైన బీజేపీని నిలదీశారు. శుక్రవారం నాడు వేముల రోహిత్ అంశంపై స్పందించారు.

రోజుకో అంశంపై స్పందిస్తానన్నారు. ఐదు అంశాలపై ఐదు రోజుల పాటు స్పందించనున్నారు. ఇప్పటికే రెండు అంశాలపై స్పందించిన పవన్ శని, ఆది, సోమవారాలు కూడా బీజేపీని నిలదీయనున్నారు.

చంద్రబాబు 'కొత్త' ఆలోచన, రాజధానిపై అడ్డంకిచంద్రబాబు 'కొత్త' ఆలోచన, రాజధానిపై అడ్డంకి

పక్కా ప్లాన్‌తో.. పవన్ మనసులో ఏముందో తేలిపోయింది!

ప్రత్యేక హోదా పైన వరుస సభలతో పాటు, బీజేపీ హయాంలోని పలు అంశాలపై వరుసగా ఆయన నిలదీయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో రాజకీయ పరిణామాలు మారుతున్నట్లుగా కనిపిస్తున్నాయి.

'కేంద్రం చేతులు దులిపేసుకుంది, బాబు ఏంచేస్తారు: దేశంతో పాటు ఏపీ సర్వనాశనం''కేంద్రం చేతులు దులిపేసుకుంది, బాబు ఏంచేస్తారు: దేశంతో పాటు ఏపీ సర్వనాశనం'

ప్రత్యేక హోదాపై నిలదీత, ఇటీవల లెఫ్ట్ పార్టీ నేతలతో ఆయన భేటీ కావడం, ఆ తర్వాత వేముల రోహిత్, గోవధ తదితర ఐదు అంశాలపై స్పందించాలని నిర్ణయించుకోవడాన్ని బట్టి చూస్తుంటే పవన్ మనసులో ఏముందో తెలిసిపోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

2019 నాటికి ఆయన బిజెపి - టిడిపిలకు దూరమేనని తేలిపోయిందని, అదే సమయంలో లెఫ్ట్ పార్టీతో జత కట్టడం కోసం సిద్ధమయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి లెఫ్ట్‌తో పొత్తు కోసం సిద్ధమైన పవన్.. వ్యూహాత్మకంగానే బీజేపీ పైన ఎదురు దాడి చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

English summary
Pawan Kalyan attacking BJP with complete strategy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X