Pawan Kalyan on Lokesh: లోకేష్ కు ప్రమోషన్ పై నోరువిప్పిన పవన్..! కీలక వ్యాఖ్యలు..!
ఏపీలో రెండేళ్ల క్రితం కూటమి గట్టి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ, జనసేన, బీజేపీ త్వరలో రెండేళ్ల పాలన పూర్తి చేసుకోబోతున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కాగానే మంత్రి లోకేష్ (nara Lokesh)ను డిప్యూటీ సీఎం చేయాలని, సీఎం చేయాలనే డిమాండ్లను టీడీపీ తెరపైకి తెచ్చింది. పవన్ కళ్యాణ్ (pawan kalyan)ఉండగా లోకేష్ ను ఎలా డిప్యూటీ సీఎం చేస్తారంటూ జనసేన నిలదీయడం మొదలుపెట్టేసరికి టీడీపీ సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు లోకేష్ టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడయ్యారు. దీంతో ఆయనకు టీడీపీ శ్రేణులు, నేతల నుంచి నిన్న శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
అయినా కూటమిలో కీలక భాగస్వామి అయిన పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించలేదు. దీంతో లోకేష్ ఎలివేషన్ తనపై చూపే ప్రభావాన్ని గమనించి పవన్ సైలెంట్ గా ఉన్నారనే చర్చ జరిగింది. అయితే ఇవాళ లోకేష్ ప్రమోషన్ పై పవన్ స్పందించారు. ఈ మేరకు జనసేన అధికారిక గ్రూపులో ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఆయన లోకేష్ కు శుభాకాంక్షలు తెలుపుతూనే కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన సహచర మంత్రి, సోదరుడు నారా లోకేష్ కు హృదయపూర్వక అభినందనలు అంటూ పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించిన లోకేష్ కొత్త బాధ్యతలలో సఫలీకృతులు కావాలని, కూటమి స్ఫూర్తిని సమర్థంగా కొనసాగిస్తారని ఆకాంక్షిస్తున్నానని వెల్లడించారు. టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా మరోసారి ఎన్నికైన పల్లా శ్రీనివాసరావుకు కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ ప్రకటనలో కూటమి స్ఫూర్తిని సమర్ధంగా కొనసాగిస్తారని ఆశిస్తున్నట్లు పవన్ చెప్పడంపై చర్చ జరుగుతోంది.














Click it and Unblock the Notifications