అలా అమరావతిలో.. కొత్త సినిమా కోసం పవన్ కళ్యాణ్ నయా ప్లాన్ !!

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరోవైపు వరుస సినిమాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ఓ వైపు ప్రజా సేవలో కొనసాగుతూనే.. కమిట్ అయిన సినిమాలను ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. గతేడాది హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్.. ఈ ఏడాది ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఓజీ ఘన విజయం సాధించగా.. మిగిలిన రెండు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన ఉస్తాద్ గబ్బర్ సింగ్ కాంబో లెవెల్లో హిట్ కొడుతుందని అంతా భావించారు. కానీ విడుదలైన మొదటి రోజు నుంచే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. కనీసం వంద కోట్లు కూడా రాబట్టలేకపోయింది.

ఈ క్రమంలోనే తన నెక్ట్స్ చిత్రాల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. కాగా స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ ఒక భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గత సినిమాల విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సినిమా మొదలవ్వాలంటే ఎట్టి పరిస్థితుల్లో స్క్రిప్ట్ పూర్తవ్వాల్సిందేనని సురేందర్ రెడ్డికి హుకుం జారీ చేశారట పవన్.

pawan-kalyan-new-plan-for-director-surendar-reddy-movie-and-office-started-in-amaravathi

అమరావతిలో ఆఫీస్..

పవన్ ఆదేశాలతో ఈ సినిమా కోసం సురేందర్ రెడ్డి ప్రత్యేకంగా విజయవాడ/అమరావతిలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవహారాలతో ఎక్కువగా అక్కడే ఉండటం వల్ల.. స్క్రిప్ట్ డిస్కషన్స్, ప్రీ-ప్రొడక్షన్ పనులు సులభంగా సాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు ఇటీవల పవన్ కళ్యాణ్ లుక్ కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పవన్ కొత్తగా గడ్డం పెంచుకుని కనిపించడం చూసి ఇది కొత్త సినిమా కోసమా? లేక 'OG 2' కోసమా? అనే చర్చలు మొదలయ్యాయి. ఒకవేళ సూరి-వక్కంతంల స్క్రిప్ట్ ఏమాత్రం లేట్ అయినా.. పవన్ వెంటనే 'ఓజీ 2'ని పట్టాలెక్కిస్తారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

ఇక సురేందర్ రెడ్డి గతంలో 'Kick', 'Race Gurram', 'Sye Raa Narasimha Reddy' వంటి చిత్రాలతో తన ప్రత్యేక ముద్ర వేశారు. ఆయన స్టైలిష్ మేకింగ్, కమర్షియల్ ఎలిమెంట్స్‌కు ప్రసిద్ధి. 'Agent' సినిమా నిరాశపరిచినప్పటికీ, పవన్ కళ్యాణ్‌తో చేసే ఈ ప్రాజెక్ట్ ద్వారా తిరిగి బలంగా కంబ్యాక్ ఇవ్వాలని భావిస్తున్నారు. మరి ఈ సినిమాలు పవర్ స్టార్‌ను మళ్లీ వింటేజ్ అవతార్‌లో చూపిస్తాయా అన్నది ఇప్పుడు అందరి ఆసక్తిగా మారింది. మరి పవన్ అభిమానుల ఆశలు నెరవేరుతాయో లేదో వేచి చూడాల్సిందే!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+