మౌనం వీడి బయటికి రండి..! హిందువులకు పవన్ పిలుపు..!
ఏపీలో గత కొన్ని రోజులుగా తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం సాగుతోంది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై సుప్రీంకోర్టు సిట్ దర్యాప్తు చేయించడం, తాజాగా కోర్టులో ఛార్జిషీట్ కూడా దాఖలు కావడంతో దీనిపై ఉత్కంఠ పెరిగింది. ఇందులో కొవ్వులు కలిశాయనని లేకపోవడం, కల్తీ జరిగిందని చెప్పడంతో ప్రభుత్వం ఈ రిపోర్ట్ పై విచారణ కమిటీ ఏర్పాటు చేయబోతోంది.
ఈ నేపథ్యంలో రాష్టంలో ఇంత జరుగుతున్నా.. హిందువులు మౌనంగా ఉండటాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (pawan kalyan) ప్రశ్నించారు. ఈ మేరకు ఇవాళ ఓ ట్వీట్ చేశారు. ప్రతీ భక్తుడిపై ధార్మిక బాధ్యత ఉంది...!ప్రతీ సగటు హిందువు మనసులో ఉన్న అలసత్వం నుంచి బయటకు రావాల్సిన సమయం వచ్చిందని అందులో తెలిపారు. మనందరిలో దేవుడిపై భయం ఉంది, ధర్మంపై గౌరవం ఉంది, కానీ హిందూ దేవతలను అవమానించినప్పుడు లేదా మన ధర్మాన్ని ఎగతాళి చేసినప్పుడు, మన బాధను మనలోనే దాచుకొని, "కర్మ చూసుకుంటుంది" అని అనుకొని మౌనంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.

Pawan Kalyan: వైసీపీకి పవన్ తాజా వార్నింగ్- క్లీన్ చిట్ ప్రచారంపై ఫైర్..!
ఈ విధానం ఖచ్చితంగా మారాలన్నారు. కులం, మతం, ప్రాంతం, భాషల ద్వారా మనం విడిపోయినట్టుగా కనిపించినా, మనందరి ధర్మం ఒకటే, దేవతలు ఒక్కరే అని పవన్ గుర్తుచేశారు. మన ధర్మం, మన విశ్వాసం తప్పుడు ఆలోచనలతో అపహాస్యం చేయబడినప్పుడు, మన వేదనను, బాధను బహిరంగంగా వ్యక్తపరచడం మన నైతిక బాధ్యత అన్నారు. అలాంటి సందర్భాల్లో మౌనం పాటించడం మనందరి సహనాన్ని బలహీనంగా చూపిస్తుందన్నారు. మనం కేవలం భక్తులుగా మాత్రమే కాకుండా, మన ధర్మ పరిరక్షకులుగా మారాలన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడటం అంటే ఇతర మతాలకు వ్యతిరేకంగా ఉండటం కాదని, కేవలం మన ధర్మాన్ని మనం రక్షించుకోవడమే అంటూ పవన్ ముగించారు.












Click it and Unblock the Notifications