దానికి జవాబు చెప్పు: బాబుకు వీర్రాజు దిమ్మతిరిగే కౌంటర్, ఇదీ విషయం.. హోదాపై పవన్ క్లారిటీ

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తెలుగుదేశం పార్టీ తమపై విమర్శలు చేయడం సరికాదని భారతీయ జనతా పార్టీ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మంగళవారం అన్నారు.

చదవండి: కేంద్రం ఎలా మోసగించిందంటే: వివరాలతో సహా మోడీకి కేశినేని నాని షాక్, ఎంపీలకూ

ఏపీ ప్రయోజనాలకు బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు. పవన్ ప్రశ్నలు సంధిస్తే ఆయన వెనుక బీజేపీ ఉందని, ఆ పార్టీ స్క్రిప్ట్ అని చెప్పడం ఏమిటని చంద్రబాబు, టీడీపీ నేతలపై మండిపడ్డారు.

చదవండి: మోడీపై ఈగ వాలనివ్వరా, బీజేపీ చెప్పలేదని పవన్ కళ్యాణ్ అంటారా: బాబు షాకింగ్

పవన్ మాటలకు సమాధానం చెప్పాలి

పవన్ మాటలకు సమాధానం చెప్పాలి

పవన్ మాటలకు టీడీపీ నేతలు సమాధానం చెప్పాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఎవరు మాట్లాడినా బీజేపీపై రుద్దడం సరికాదన్నారు. ప్రభుత్వం ఆరోపణలను తట్టుకునే శక్తి తమ పార్టీకి ఉందని చెప్పారు.

చంద్రబాబు జైలుకు పంపిస్తామని హెచ్చరించారుగా

చంద్రబాబు జైలుకు పంపిస్తామని హెచ్చరించారుగా

ప్రత్యేక హోదా అంటే జైలుకు వెళ్తారని హెచ్చరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు అదే హోదాపై ఎలా మాట్లాడుతారని సోము వీర్రాజు గట్టి కౌంటర్ ఇచ్చారు. పోలవరం 2018 నాటికి ఎలా పూర్తి చేస్తారని అడిగారు.

గతంలో వ్యతిరేకించి ఇప్పుడు సెంటిమెంటుగా

గతంలో వ్యతిరేకించి ఇప్పుడు సెంటిమెంటుగా

చంద్రబాబు, టీడీపీ నేతలు గతంలో వ్యతిరేకించిన అంశాలనే ఇప్పుడు సెంటిమెంటు అస్త్రాలుగా చిత్రీకరించాలని చూస్తున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. తాత్కాలిక రాజధానికి ఇచ్చిన యూసీలో ఏమున్నాయో చూడాలన్నారు.

ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ క్లారిటీ

ఏపీకి హోదాతో పాటు ఆర్థికపరమైన నిధులు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ మంగళవారం ట్వీట్ చేశారు. ప్రత్యేక హోదాతో పాటు చట్టంలో చెప్పిన హామీలు నెరవేర్చాలన్నారు. తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తున్నారని టీడీపీ, చంద్రబాబుపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

రిపోర్టర్లు తప్పుగా అర్థం చేసుకున్నారని

ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ యూటర్న్ తీసుకున్నారని టీడీపీ నేతలు చెబుతోన్న విషయం తెలిసిందే. స్వయంగా సీఎం చంద్రబాబు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పవన్ పైవిధంగా స్పందించారు. రిపోర్టర్లు తప్పుగా అర్థం చేసుకున్నారని పవన్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+