వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాడు ముద్దులు పెట్టిమరీ ఉద్యోగాల హామీ ఇచ్చారు.. ఎన్ని ఉద్యోగాలిచ్చారు జగన్: పవన్ కళ్యాణ్

|
Google Oneindia TeluguNews

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సర్కార్ పై మండిపడ్డారు. రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వడం, ఉపాధి కల్పన చేయడం అంటే తమ వాళ్లకు సలహాదారుల పోస్టులు ఇచ్చుకోవడం, వాటిని పొడిగించడం కాదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇక ఈ విషయాన్ని పాలకులు గుర్తించాలని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. శుక్రవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పాలన పై విరుచుకుపడ్డారు.

మత్స్యకారుల కోసం జనసేనాని పోరాటం; ఫిబ్రవరి 20న పవన్ కళ్యాణ్ మత్స్యకార అభ్యున్నతి సభమత్స్యకారుల కోసం జనసేనాని పోరాటం; ఫిబ్రవరి 20న పవన్ కళ్యాణ్ మత్స్యకార అభ్యున్నతి సభ

 ముద్దులు పెట్టి మరీ ఉద్యోగాలిస్తామని వాగ్దానాలు చేశారు

ముద్దులు పెట్టి మరీ ఉద్యోగాలిస్తామని వాగ్దానాలు చేశారు

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తో పాటు జాబ్ క్యాలెండరు కూడా ఇచ్చేస్తాం అంటూ వాగ్దానాలు చేశారని, ఏటా ఆరు వేల పోలీసు ఉద్యోగాలు, 25 వేల టీచర్ పోస్టులు ఇస్తామని ముద్దులు పెట్టి మరీ చెప్పారని ఎద్దేవా చేశారు. ఇంతవరకు డీఎస్సీ లేదు, పోలీస్ ఉద్యోగాల భర్తీ లేదని విమర్శించారు. రాష్ట్రంలో గ్రూప్ వన్, గ్రూప్ టూ ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడంలేదని పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు. అధికారం లోకి రావడానికి పిచ్చిపిచ్చి హామీలిచ్చి, ఇప్పుడు వాటిని నెరవేర్చడం మర్చిపోయారని జగన్ ఎద్దేవా చేశారు పవన్ కళ్యాణ్.

 నిరుద్యోగ యువత నిరాశా నిస్పృహల్లో ఉన్నారు

నిరుద్యోగ యువత నిరాశా నిస్పృహల్లో ఉన్నారు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చర్యలతో యువత నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిందని, నిరుద్యోగులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన లోకి వచ్చిన రెండేళ్ల తర్వాత పదివేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ వేశారని, అవి ఇప్పటికీ భర్తీ చేయలేదని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఉద్యోగాల కోసం యువత కలెక్టరేట్లకు వెళితే వారిపై లాఠీఛార్జ్ చేయించి అరెస్టు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. రాష్ట్రంలో యువతకు మేలు చేయడానికి, ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడానికి, ముఖ్యమంత్రి జగన్ ఇప్పటివరకు ఎన్ని సమీక్ష సమావేశాలు నిర్వహించారో చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

 ఉద్యోగాల కల్పనకు యాక్షన్ ప్లాన్ అసలు వైసిపి ప్రభుత్వం దగ్గర ఉందా?

ఉద్యోగాల కల్పనకు యాక్షన్ ప్లాన్ అసలు వైసిపి ప్రభుత్వం దగ్గర ఉందా?

రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు అన్న పవన్ వాళ్లకు ఉద్యోగాలను కల్పించడానికి అవసరం అయ్యే యాక్షన్ ప్లాన్ అసలు వైసిపి ప్రభుత్వం దగ్గర ఉందా అంటూ ప్రశ్నలు సంధించారు. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కోసం జగన్ ఇప్పటివరకు ఎన్ని నిర్ణయాలు తీసుకున్నారంటూ ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి జగన్ తీసుకున్న నిర్ణయాల అమలు ఎంతవరకు వచ్చిందని జగన్ ను నిలదీశారు పవన్ కళ్యాణ్. బీఈడీలు చేసి టీచర్ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి నిరుద్యోగ యువత నిరీక్షిస్తున్నారు అని పేర్కొన్నారు.

నిరుద్యోగుల ఆందోళన జగన్ కు అర్ధం అవుతుందా?

నిరుద్యోగుల ఆందోళన జగన్ కు అర్ధం అవుతుందా?


వివిధ ఉద్యోగాలకు సంబంధించి పోటీపరీక్షలకు సిద్ధమైన ఎంతో మంది నిరుద్యోగులు నోటిఫికేషన్లు లేకపోవడంతో ఏజ్ బార్ అవుతుందని ఆందోళనలో ఉన్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నిరుద్యోగుల ఆందోళన ప్రభుత్వానికి అర్థం అవుతుందా అంటూ ప్రశ్నించారు . ఒకవేళ అర్థమైనా అర్థం కానట్టు ఉందా అనే సందేహం కలుగుతోందని వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్వయంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల విషయంలో సమాధానం చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

English summary
Pawan Kalyan has targeted Jagan on the issue of unemployment saying that giving jobs does not mean giving your advisor posts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X