తనయుడి క్షేమం కోరుతూ: సింగపూర్‌కు పవన్ ప్రయాణం- వెంట వాళ్లిద్దరూ

Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్.. సింగపూర్‌ పాఠశాలలో సంభవించిన అగ్నిప్రమాదంలో గాయపడిన ఘటన.. రెండు తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. అటు రాజకీయ నాయకులు, ఇటు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోన్నారు. ఈ ఘటనపై ఆరా తీస్తోన్నారు.

సింగపూర్ రివర్ వ్యాలీ రోడ్‌లో మూడంతస్తుల భవనం సోప్‌హౌస్‌లో గల టమాటో కుకింగ్ స్కూల్‌లో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. చిన్న పిల్లల కోసం కుకింగ్ లెసన్స్ బోధించడం, దానికి అనుగుణంగా క్యాంప్ నిర్వహిస్తోన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో మార్క్ శంకర్ పవనోవిచ్ సహా 20 మంది విద్యార్థులు ఉన్నారు.

Pawan Kalyan departed Singapore along with Chiranjeevi

సమాచారం అందిన వెంటనే సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్సెస్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నాయి. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. మూడు అగ్నిమాపక శకటాలు మంటలను ఆర్పివేశాయి. ఈ ఘటనలో సోప్ హౌస్ బిల్డింగ్ రెండు, మూడో అంతస్తు పూర్తిగా దగ్ధమైంది.

ఈ ఘటనలో గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తోన్నారు. మార్క్ శంకర్‌ చేతులు, కాళ్లకు కాలిన గాయాలయ్యాయని పెదనాన్న చిరంజీవి వెల్లడించారు. శంకర్ ఆరోగ్యం బాగుందని, కోలుకుంటోన్నాడని వివరించారు. దీనితో మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఈ ముగ్గురూ తమ అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ పెశారు.

Pawan Kalyan departed Singapore along with Chiranjeevi

నిన్నటివరకు అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్.. సింగపూర్‌కు బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ ఉన్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సింగపూర్‌కు వెళ్లారు. మార్క్ శంకర్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి చేరుకుని, ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటారు.

మార్క్ శంకర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యేంత వరకూ పవన్ కల్యాణ్, చిరంజీవి దంపతులు సింగపూర్‌లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. నిజానికి- అగ్నిప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే అర్ధాంతరంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనను ముగించుకుని సింగపూర్‌కు వెళ్తారంటూ వార్తలొచ్చాయి. అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకోవడం ఇష్టం లేకపోవడం, వాటిని పూర్తి చేసుకున్న తరువాతే వెళ్లాలనుకున్నారు పవన్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+