పవన్ సంచలన నిర్ణయం, వారి పదవుల రద్దు..!!

డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. పవన్ వైఖరిలో స్పష్ట మైన మార్పు కనిపిస్తోంది. పార్టీ వ్యవహారాల పైన ఫోకస్ చేసిన పవన్ వరుసగా జిల్లాల వారీగా కీలక నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. ఆరోపణలు.. క్రమశిక్షణ లేని వారి విషయంలో కఠిన చర్యలకు సిద్దం అయ్యారు. అందులో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పార్టీ కమిటీలను రద్దు చేసిన పవన్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం ప్రకటించారు. పవన్ నిర్ణయాలు పార్టీలో కొత్త చర్చగా మారాయి.

జనసేన అధినేత పవన్ వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ పరంగా ఫోకస్ చేసిన పవన్ తాజా నిర్ణయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పార్టీ నాయకత్వంలో క్రమశిక్షణ లోపించడం, పార్టీ విధి విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ఉన్న అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ మద్దతుదారులు, జనసైనికుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పవన్ తెలిపారు. జనసేన సిద్ధాంతాలు, విధానాలకు ఆకర్షితులై పార్టీని బలోపేతం చేశామని, అయితే కొందరు నాయకుల ప్రవర్తన ఆ లక్ష్యాలకు విరుద్ధంగా ఉందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారని పేర్కొన్నారు. జిల్లాలో నాయకుల మధ్య విభేదాలు, సమన్వయ లోపం, క్రమశిక్షణరాహిత్యం కారణంగా పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.

పవన్ కు NDA బిగ్ ఆఫర్, నాటి త్యాగానికి ఫలితం..!!
పవన్ కు NDA బిగ్ ఆఫర్, నాటి త్యాగానికి ఫలితం..!!
pawan-kalyan-dissolved-all-its-committees-in-the-erstwhile-nellore-district-citing-indiscipline-her

మరిన్ని కీలక నిర్ణయాలకు సిద్దం అవుతున్న పవన్

ఈ పరిస్థితుల్లో పార్టీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉమ్మడి నెల్లూరు జిల్లా, నగర, మండల, గ్రామస్థాయి కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అలాగే జిల్లా సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తున్న వారితో పాటు కమిటీల్లోని ఇతర సభ్యులను కూడా తమ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. క్రమశిక్షణ లేని చోట పార్టీ వ్యవస్థ సక్రమంగా నడవదని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పవన్ వివరించారు. కాగా, కొద్ది రోజుల క్రితం ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీని కూడా ఇదే కారణాలతో రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కొత్త కమిటీ నియామకం జరిగే వరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ వ్యవహారాలను జనసేన కేంద్ర కార్యాలయం నేరుగా పర్యవేక్షిస్తుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. దీంతో.. వరుసగా జిల్లాల వారీగా పవన్ తీసుకుంటున్న నిర్ణయాలతో పార్టీలో నేతలు అలర్ట్ అవుతున్నారు. ఇక.. రానున్న రోజుల్లో పవన్ ఎలాంటి నిర్ణయాలు అమలు చేస్తారనే ఉత్కంఠ ముఖ్య నేతల్లో కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+