వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిరుద్యోగ యువత పక్షాన మాట్లాడే గొంతు నొక్కాలనుకొంటున్నారా? మీ వల్ల కాదన్న పవన్ కళ్యాణ్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులందరికీ ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంప్లాయిమెంట్ ఆఫీస్ లలో అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడానికి పిలుపునిచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో ఈరోజు వినతి పత్రాలు ఇవ్వడానికి ప్రయత్నం చేసిన జనసేన నాయకులను హౌస్ అరెస్టులు, అరెస్టులు చేయడంపై పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

నిరుద్యోగ యువత పక్షాన మాట్లాడే గొంతు నొక్కాలని చూస్తున్నారా ?

నిరుద్యోగ యువత పక్షాన మాట్లాడే గొంతు నొక్కాలని చూస్తున్నారా ?

నిరుద్యోగ యువత పక్షాన మాట్లాడే గొంతు నొక్కాలని అనుకుంటున్నారని మండిపడిన పవన్ కళ్యాణ్ జనసైనికులను ఎవరూ అడ్డుకోలేరని ద్వజమెత్తారు. రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇస్తే ఎంతో ఆశగా నమ్మిన నిరుద్యోగ యువతకు ప్రభుత్వం చేసిన వంచనపై జనసేన ప్రశ్నిస్తుందని ఆయన అన్నారు. నిరుద్యోగ యువతకు అండగా నిలిస్తే అక్రమంగా అరెస్టు చేసి గొంతు నొక్కే ప్రయత్నం చేయడం అప్రజాస్వామికమని పవన్ కళ్యాణ్ విమర్శించారు.

జనసేన వినతి పత్రాల సమర్పణ కార్యక్రమాన్ని అడ్డుకుంటారా ?

జనసేన వినతి పత్రాల సమర్పణ కార్యక్రమాన్ని అడ్డుకుంటారా ?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన హామీని విస్మరించి కేవలం 10 వేల ఉద్యోగాలతో సరి పెడితే నిరుద్యోగ యువతీ యువకులు ఆక్రోశిస్తున్నారన్నారు . జనసేన నాయకులు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కార్యాలయాలలో వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం చేపడితే ప్రభుత్వం అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు పవన్ కళ్యాణ్. జనసేన నాయకులను అర్ధరాత్రి నుంచి గృహనిర్బంధాలకు గురి చేయడం, అరెస్టులు చేయడం ద్వారా భయపెట్టే ప్రయత్నం చేశారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

నిర్బంధాలు , అరెస్ట్ లతో జనసైనికులను ఆపలేరు

నిర్బంధాలు , అరెస్ట్ లతో జనసైనికులను ఆపలేరు

ధర్మం, న్యాయం పక్షాన మాట్లాడటం ప్రజాస్వామ్యయుతంగా ముందుకు వెళ్లడం జనసేన నైజమని ఈ సందర్భంగా స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్ నిర్బంధాలు, అరెస్టులతో ఉద్యమాన్ని నిలువరించడం సాధ్యం కాదంటూ స్పష్టం చేశారు. ఎవరు ఎంతగా కట్టడి చేసిన నిరుద్యోగుల కోసం జన సైన్యం ముందుకు సాగుతూనే ఉంటుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈరోజు జిల్లా ఉపాధి అధికారులకు వినతి పత్రాలు సమర్పించిన జన సైనికులకు ధన్యవాదాలు తెలిపిన పవన్ కళ్యాణ్ నిర్బంధాలు, నిబంధనలు జనసేనకు మాత్రమేనా అంటూ ప్రశ్నించారు.

నిబంధనలు జనసేనకేనా ? ఉద్యోగాల కోసం ఉద్యమం కొనసాగిస్తాం

నిబంధనలు జనసేనకేనా ? ఉద్యోగాల కోసం ఉద్యమం కొనసాగిస్తాం


అధికార పార్టీ నేతల కార్యక్రమాలకు, సన్మానాలకు నిబంధనలు ఎందుకు వర్తించటం లేదని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. నిబంధనలు, నిర్బంధాలు జనసేనకేనా అంటూ నిప్పులు చెరిగారు. నిరుద్యోగ యువత సమస్య తీరే వరకు ఉద్యోగాల కల్పన జరిగేవరకూ జనసేన నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తుందని, అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు.

English summary
Pawan Kalyan was incensed on ysrcp govt on job calendar. He said that no one can stop the janasena team. He said Janasena would question the government's betrayal of unemployed youth, who are hopeful of promising 2.50lakh jobs. Pawan Kalyan has criticized the government for illegally arresting and house arresting the leaders who is fighting for the jobs to unemployed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X