టీడీపీని ఫిక్స్ చేసిన పవన్, చంద్రబాబు ఒప్పుకుంటేనే - జగన్ కు కలిసొచ్చేనా..!!

టీడీపీని పక్కా వ్యూహాత్మకంగా పవన్ ఫిక్స్ చేసారు. టైం..ప్లేస్ చూసి మరీ దెబ్బ కొట్టారు. ఎక్కడైతే పవన్ బలం ఎక్కువగా ఉందో అక్కడే తన మనసులో మాట చెప్పారు. తొలిసారిగా చెబుతున్నానంటూ తానే సీఎం కావాలనుకుంటున్నానని..మద్దతుగా నిలవాలని అభ్యర్ధించారు. ఏపీలో ఎవరు అధికారంలోకి రావాలన్నా గోదావరి జిల్లాలే కీలకం. సీఎంగా తానే అనే రేసులో అనే నినాదం నుంచి పవన్ వెనక్కు వెళ్లలేరు. వెళ్తే విశ్వసనీయత ఉండదు. ఇప్పుడు ఇదే టీడీపీ సమస్యగా.. వైసీపీకి వరంగా మారుతోంది.

టీడీపీకి షాక్ ఇస్తున్న పవన్:పవన్ కల్యాణ్ తన వారాహి యాత్రతో వైసీపీకి కాదు..పరోక్షంగా టీడీపీకి షాక్ ఇచ్చారు. చంద్రబాబు తాను సీఎం అయ్యేందుకు పవన్ సహకారం తీసుకోవాలని భావించారు. అందు కోసం జనసేనతో పొత్తుకు ప్రతిపాదించారు. ఇద్దరు నేతలు పలుమార్లు మంతనాలు జరిపారు.

Pawan Kalyan fix Chandrababu turns an advantage for CM Jagan - undivided Godavari districts to decide

పవన్ సైతం కొద్ది రోజుల క్రితం వరకూ తాను సీఎం రేసులో లేననే సంకేతాలు ఇచ్చారు. దీని పైన శ్రేయోభిలాషులు..సన్నిహితులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేసారు. కానీ, వారాహి యాత్ర సమయానికి సీన్ మారిపోయింది. ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ సహకారంతో మెజార్టీ సీట్లు సాధిస్తే అధికారం ఖాయమనేది చంద్రబాబు వ్యూహం. అక్కడే ఇప్పుడు పవన్ టీడీపీని వ్యూహాత్మకంగా దెబ్బ తీసారు. తాను సీఎం రేసులో ఉన్నానని..ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ పదే పదే అభ్యర్ధిస్తున్నారు.

సీఎం అవుతానంటూ..టీడీపీని ఫిక్స్:యాత్ర..సభల్లో ఎక్కడా పొత్తుల ప్రస్తావన తేవటం లేదు. తాను సీఎం అవ్వటం..జనసేనకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వటం పైనే పవన్ ప్రసంగాలు కొనసాగుతున్నాయి. పవన్ వ్యాఖ్యలను టీడీపీ నిశితంగా పరిశీలిస్తోంది. పదే పదే సీఎం కావాలని అనుకుంటున్నాంటూ గోదావరి జిల్లాల్లో చెప్పుకొస్తున్నారు.

పరోక్షంగా తనతో పాత్తు కోరుకుంటున్న చంద్రబాబుకు తన ఆలోచన స్పష్టం చేస్తున్నారు. తాను సీఎం పదవికి పోటీలో ఉన్నానని చెప్పకనే చెబుతున్నారు. వైసీపీ నేతలు పదే పదే చంద్రబాబు సీఎం అయ్యేందుకు జనసైనికులను పవన్ పావులుగా వాడుకుంటున్నారని చేస్తున్న ఆరోపణలకు సమాధానంగా పవన్ ఈ తరహాలో తానే సీఎం ప్రచారం తెర మీదకు తీసుకొచ్చారు. అయితే, ప్రజల మధ్యకు వచ్చి తానే సీఎం అభ్యర్ధి అంటూ చెబుతున్న పవన్ ఆ తరువాత వెనుకడుగు వేసే అవకాశం ఉండదు.

చంద్రబాబు చేతిలోనే నిర్ణయం:ఇప్పుడు చంద్రబాబు పొత్తు కొనసాగాలంటే సీఎం పదవి షేరింగ్ పైనా హామీ ఇవ్వక తప్పని పరిస్థితి పవన్ కల్పిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. అందుకు చంద్రబాబు అంగీకరిస్తారా అంటే సందేహమే. ముందుగా అధికారంలోకి రావటం కోసం చంద్రబాబు అంగీకరించక తప్పదనే వాదన ఉంది.

ఇప్పుడు తనను సీఎం చేయమని చెబుతున్న పవన్.. పవర్ షేరింగ్ ఒప్పందం లేకుంటే ప్రజల్లోకి వెళ్లి టీడీపీ, జనసేనకు ఓటు వేయమని అడగలేరనే విశ్లేషణలు మొదలయ్యాయి. అలా అడిగితే పవన్ విశ్వసనీయతకు మొదటికే మోసం వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పవన్ కొత్త లెక్కలు..వ్యూహాలు పరోక్షంగా సీఎం జగన్ కు కలిసి వచ్చేలా మారుతున్నాయనే వాదన కూడా మొదలైంది. ఇప్పుడు పవన్ పక్కాగా టీడీపీని ఫిక్స్ చేసారు. ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+