Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ రెండు వర్గాలపై పవన్ ఫోకస్ ? వైసీపీ ఓటు బ్యాంక్ టార్గెట్ గా ! అప్రమత్తమైన జగన్ !

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనూహ్యంగా ఏపీ రాజకీయాల కేంద్రబిందువుగా మారిపోతున్నారు. 2019 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్ధితుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నా ఫలితం కనిపించకపోవడంతో వైసీపీపై పోరు కోసం సీరియస్ గా పోరాడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుతో ఇప్పటికే చేతులు కలిపిన పవన్.. ఇప్పుడు అధికార పార్టీకి అండగా నిలిచిన రెండు కీలక సామాజిక వర్గాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. త్వరలో శ్రీకాకుళం జిల్లా రణస్ధలంలో నిర్వహించే యువశక్తి సభ ద్వారా ఇందులో ఓ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ పాలిటిక్స్

పవన్ కళ్యాణ్ పాలిటిక్స్


ఏపీలో జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయం తారా స్దాయికి చేరుకుంటోంది. 2019 ఎన్నికల్లో ఎలాంటి ముందస్తు వ్యూహాలు లేకుండా దూకుడుగా వెళ్లి దెబ్బతిన్న పవన్ కళ్యాణ్.. ఈసారి మాత్రం ఆ తప్పును పునరావృతం చేయకూడదని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఈసారి పక్కా హోమ్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓవైపు మిత్రపక్షం బీజేపీతో తెగదెంపులు చేసుకోకుండానే కొత్త మిత్రపక్షం టీడీపీ అధినేతతో వరుసగా భేటీ అవుతున్నారు. దీంతో బీజేపీ పవన్ ను ఏమనలేక చేష్టలుడిగి చూస్తోంది. ఇదే అదనుగా పవన్ తన రాజకీయానికి పదును పెడుతున్నారు.

మత్సకారులపై పవన్ ఫోకస్

మత్సకారులపై పవన్ ఫోకస్

రాష్ట్రంలో బీసీ కులమైన మత్సకారులను తమవైపు తిప్పుకునేందుకు పవన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళంలోని రణస్ధలంలో యువశక్తి సభ వెనుక ఉద్దేశం కూడా ఇదేనంటున్నారు. యువశక్తి సభకు భారీగా మత్సకార యువతను ఆకర్షించేందుకు జనసేన నేత నాదెంద్ల మనోహర్ ఉత్తరాంధ్రలోనే పాగా వేసి ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు వెయ్యి కిలోమీటర్ల మేర ఉన్న తీర ప్రాంతంలో మత్సకారుల ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో వీరిని తమవైపు తిప్పుకునేందుకు పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు. 2019లో అన్ని సామాజిక వర్గాల్లాగే వైసీపీకి అండగా నిలిచిన మత్సకారులు.. ఆ తర్వాత కొంతమేర దూరమయ్యారు.దీంతో వారిలో అసంతృప్తిని సొమ్ము చేసుకునేందుకు పవన్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

ముస్లింలపై పవన్ ఫోకస్

ముస్లింలపై పవన్ ఫోకస్

రాష్ట్రంలో బీజేపీతో పొత్తు కారణంగా పవన్ కళ్యాణ్ కు గతంలో ముస్లింలు దూరమయ్యారు. ఇదే భయంతో వైసీపీ ఇప్పటికీ బీజేపీతో అధికారికంగా పొత్తు పెట్టుకోకుండా నెట్టుకొస్తోంది. కానీ రాష్ట్రంలో 2019లో తగిలిన ఎదురుదెబ్బతో పవన్ మాత్రం అదేమీ పట్టించుకోకుండా బీజేపీకి తిరిగి దగ్గరయ్యారు. అయితే దీంతో ముస్లింలు ఆయనకు దూరమయ్యారు.ఇప్పుడు బీజేపీకి శాశ్వత శత్రువులుగా ఉన్న ముస్లింలను దగ్గర చేసుకునేందుకు పవన్ ప్రయత్నాలు ప్రారంభించారు. గతేడాది పార్టీ కార్యాలయంలో చేసిన ప్రసంగంలో ముస్లింలు తనను ఆదరించాలని బహిరంగంగానే కోరిన పవన్.. ఇప్పుడు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. క్షేత్రస్ధాయిలో ప్రభావం చూపగల ఇతర పార్టీల్లోని పలువురు ముస్లిం నేతల్ని ఆకర్షించేందుకు పవన్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

అప్రమత్తమైన వైసీపీ ?

అప్రమత్తమైన వైసీపీ ?

రాష్ట్రంలో తొలిసారి పూర్తిగా తమవైపు మొగ్గిన బీసీ సామాజిక వర్గాల్లో కీలకమైన మత్సకారుల్ని, అలాగే బీజేపీతో సంబంధాల కారణంగా దూరమవుతున్న ముస్లింలను ఆకర్షించేందుకు పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నాలతో అధికార పార్టీ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో ఉత్తరాంధ్రలో అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రి అప్పలరాజు వరుసగా ఈ వర్గాలతో భేటీ అయి పవన్ యువశక్తి సభకు వెళ్లొద్దని ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే తమకు అండగా ఉన్న ముస్లింల నుంచి జనసేనలోకి వలసల్ని ఆపేందుకు క్షేత్రస్ధాయిలో వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం వైసీపీ సర్కార్లో ముస్లింలకు ఇచ్చిన పదవుల్ని గుర్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+