ఆ విషయంలో చంద్రబాబును దాటేసిన పవన్ కళ్యాణ్!
ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తన గొప్ప మనసును చాటుకుంటూనే ఉంటారు. ఇటీవల రాఖీ పండుగ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలోని వితంతు మహిళలకు చీరలు పంపి సోదరుడిగా తాను ఎప్పుడూ వారికి అండగా ఉంటానని చెప్పి తన మంచి మనసును తెలియజేశారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గ ఉపాధ్యాయులకు దినోత్సవం సందర్భంగా కానుకలు పంపించారు.
ఉపాధ్యాయ దినోత్సవ కానుకలు పంపిన పవన్ కళ్యాణ్
సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటుండగా ముందుగానే పిఠాపురం నియోజకవర్గం లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు పవన్ కళ్యాణ్ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కానుకలు పంపారు. మహిళలకు చీరలు, పురుషులకు ప్యాంటు, షర్టు అందజేశారు.

పిఠాపురం నియోజకవర్గంలో టీచర్ల సంతోషం
మొత్తం పిఠాపురం నియోజకవర్గం లోని 2000 మంది టీచర్లకు ఈ కానుకలను పంపించారు. పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాల విద్యాశాఖ కార్యాలయాలలో ఈ బట్టలను పంపిణీ చేశారు. పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ఉపాధ్యాయులను గుర్తుపెట్టుకొని కానుకలు పంపించడం పైన ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను మరచిపోని పవన్ కళ్యాణ్
ఒకవైపు సినిమాలు చేస్తూ, మరోవైపు డిప్యూటీ సీఎం గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను మర్చిపోని పవన్ కళ్యాణ్ గొప్పతనాన్ని కొనియాడుతున్నారు.ఇక ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో శ్రావణమాసం సందర్భంగా పదివేల మంది మహిళలకు చీరలు, పసుపు, కుంకుమ ను బహుమతిగా అందజేశారు పవన్ కళ్యాణ్. రాఖీ పండుగ సందర్భంగా 1500 మంది వితంతువులకు చీరలు పంపి సోదరుడిగా అండగా ఉంటానని చెప్పారు.
గురువులపై భక్తి ప్రదర్శించిన పవన్ కళ్యాణ్
ఇక ప్రస్తుతం 2000 మంది ఉపాధ్యాయులకు బట్టలు పంపి, గురువుల పట్ల తనకున్న భక్తిని ప్రదర్శించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇప్పటివరకు ఎవరు చేయని విధంగా అందరికీ తాను ఉన్నానని తెలిసేలా బహుమతులు పంపుతున్న పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం లోనే కాదు రాష్ట్రం మొత్తానికి ట్రెండ్ సెట్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications