నువ్వు చెప్తేనే: పవన్ కళ్యాణ్ దుమ్ముదులిపిన రోజా, ఆ మాటలకు దిమ్మతిరిగే కౌంటర్
Recommended Video

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా బుధవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్యాకేజీలు తీసుకునే వాళ్లకు ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయని జనసేనానిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చంద్రబాబు వద్ద ప్యాకేజీ తీసుకొని పవన్ మాట్లాడుతున్నారని వైసీపీ విమర్శలు చేస్తోన్న విషయం తెలిసిందే.
చదవండి: ఫ్యూచర్-రిలయెన్స్‌తో జట్టు, బాబు దోపిడీ ఎంతో చూడండి: రోజా హెచ్చరిక, లోకేష్ దుమ్ము దులిపి
ఇటీవల పవన్ కళ్యాణ్ ఏపీలో నాలుగు రోజుల పాటు పర్యటించారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్‌పై మండిపడ్డారు. ప్రజా సమస్యలు తీర్చాలంటే పదవులు ఉండనక్కరలేదని, వైసీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం సరికాదని జనసేనాని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో రోజా స్పందించారు.
చదవండి: 2019 ఎన్నికలు: పవన్ కళ్యాణ్ గురించి చిరంజీవి అంత మాట చెబుతున్నారా?

జగన్‌ను ప్రశ్నించే నైతిక హక్కు లేదు
పవన్ కళ్యాణ్‌కు తమ పార్టీ అధినేత జగన్‌ను ప్రశ్నించే నైతిక హక్కు లేదని రోజా మండిపడ్డారు. జగన్ నిత్యం ప్రజల్లో ఉంటున్నారని ఆమె చెప్పారు. డ్వాక్రా మహిళలకు, నిరుద్యోగులకు, రైతులకు అన్యాయం జరుగుతోందని పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

నువ్వు చెబితే ఓటేశారు
2014 ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడుకు జగన్ మద్దతిచ్చారని గుర్తు చేశారు. బాబు, మోడీకి ఓటేయండని అప్పుడు నీవు చెబితే కాపు సామాజిక వర్గం నమ్మి ఓట్లేసిందని, కానీ వారికి అన్యాయం జరుగుతోందని, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

ప్యాకేజీ కోసమే పవన్ కళ్యాణ్ విమర్శలు
ప్యాకేజీ కోసమే పవన్ కళ్యాణ్ తమ పార్టీ అధినేతపై విమర్శలు చేస్తున్నారని రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్యాకేజీలు తీసుకుంటే ప్రజా సమస్యలు ఎలా పడతాయన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వని మోడీని, ప్రజలకు న్యాయం చేయని చంద్రబాబును ప్రశ్నించాల్సింది పోయి మమ్మల్ని ప్రశ్నించడం ఏమిటని మండిపడ్డారు.

పవన్ కళ్యాణ్‌కు పదవులు వద్దయితే ట్రస్ట్
తనకు పదవులపై మమకారం లేదని, అధికారం యావ లేదని చెప్పిన పవన్ కళ్యాణ్‌కు రోజా ధీటైన కౌంటర్ ఇచ్చారు. జగన్‌కు పదవులు వద్దనుకుంటే, పదవుల కోసం పార్టీ పెట్టలేదని అనుకుంటే ఓ ఛారిటబుల్ ట్రస్ట్ పెట్టుకోవచ్చునని హితవు పలికారు. జనసేనకు అజెండా లేదన్నారు.

పవన్ గజినీలా మార్చిపోవద్దు
పవన్ కళ్యాణ్ గజినీలా అన్నీ మర్చిపోకూడదని రోజా ఎద్దేవా చేశారు. ఎన్నికల సభలో ఆనాడు నరేంద్ర మోడీ, చంద్రబాబు ఏం చెప్పారో గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. పవన్ కళ్యాణ్‌కు స్క్రిప్ట్ రాసే వ్యక్తికి అవగాహన లేనట్లుగా ఉందన్నారు. చంద్రబాబు గురించి మాట్లాడుతూ.. మళ్లీ ఛాన్స్ తనకు లేదని చెప్పే చంద్రబాబు ఇష్టారీతిన దోచుకుంటున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications