2019 ఎన్నికలు: పవన్ కళ్యాణ్ గురించి చిరంజీవి అంత మాట చెబుతున్నారా?

Recommended Video

    2019 : పవన్ కళ్యాణ్ బాబుతో కలుస్తారా ? లేదంటే పవన్ - చిరు కలుస్తారా ?

    అమరావతి: 2019 ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ మళ్లీ టీడీపీతోనే దోస్తీ కడతారా? వైయస్సార్ కాంగ్రెస్ చెప్పినట్లుగా చంద్రబాబుకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినప్పుడు జనసేనాని బయటకు వస్తున్నారా? అంటే ప్రస్తుతం ఏమీ చెప్పలేని పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు.

    పవన్ కళ్యాణ్ ప్రతి మాటలో స్పష్టత ఉందని, కానీ ఆవేశం మాత్రం కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. తాను ప్రతిపక్ష నేత జగన్‌ను గత ఎన్నికల్లో సమర్థించకపోవడానికి, చంద్రబాబుకు మద్దతు పలకడానికి పవన్ చెప్పిన కారణాన్ని తప్పుబట్టలేమని అంటున్నారు.

     బాబుకు మద్దతు - పవన్ వ్యాఖ్యలకు ఇలా కూడా బలం

    బాబుకు మద్దతు - పవన్ వ్యాఖ్యలకు ఇలా కూడా బలం

    ఇంకా చెప్పాలంటే, పవన్ కళ్యాణ్ నోటి నుంచి వచ్చిన మాటలే అప్పుడప్పుడు కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వచ్చాయని గుర్తు చేస్తున్నారు. విభజన నేపథ్యంలో నవ్యాంధ్రకు చంద్రబాబు అనుభవం అవసరమని ఏపీ ప్రజలు ఓట్లు వేశారని విపక్షాలు కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యానించాయి. పవన్ కూడా అందుకే మద్దతిచ్చానని చెప్పారు. కాబట్టి బాబుకు మద్దతివ్వడంలో ఆయనను ప్రశ్నించే అవకాశం వైసీపీకి లేకుండా పోయిందని అంటున్నారు.

    చంద్రబాబుకు హెచ్చరికలు

    చంద్రబాబుకు హెచ్చరికలు

    చంద్రబాబుకు ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడే పవన్ తెరపైకి వస్తారని ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో షూటింగ్ గ్యాప్‌లో ఆయన వస్తారని అంటున్నారు. కాబట్టి ఈ వ్యాఖ్యలు నిజం కాదని గుర్తించాలని అంటున్నారు. పైగా, రాజధాని పర్యటన సమయంలోను, ఇటీవల ఏపీలో నాలుగు రోజుల పాటు పర్యటించినప్పుడు చంద్రబాబుకు పవన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తాను ఎందుకు మద్దతిచ్చానో స్పష్టం చేస్తూ.. ఆ దిశగా ముందుకు నడవకుంటే దేనికైనా సిద్ధమని హెచ్చరించారు. అయితే, కొత్త రాష్ట్రం కాబట్టి ఓపిక పడుతున్నట్లు కూడా చెప్పారు.

     వచ్చే ఎన్నికల్లో ఎవరితో కలిసి నడుస్తారు

    వచ్చే ఎన్నికల్లో ఎవరితో కలిసి నడుస్తారు

    పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎవరితో కలిసి ముందుకు నడుస్తారనే విషయమై చర్చ సాగుతోంది. ఆయన కమ్యూనిస్టులతో కలిసి వెళ్లే అవకాశాలున్నాయని కొందరు అంటుంటే, టీడీపీతోనే ఉంటారని మరికొందరు చెబుతున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే మాత్రం బీజేపీకి 2019లో కచ్చితంగా దూరంగానే ఉంటారని మాత్రం ఖాయమైందని చెబుతున్నారు.

    చిరంజీవి ఆ మాట అన్నారా?

    చిరంజీవి ఆ మాట అన్నారా?

    ఇదిలా ఉండగా తాజాగా, మరో ప్రచారంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇటీవల ఓ పత్రికలో ఆసక్తికర విషయం వచ్చింది. దీనిపై చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో మా వాడు చంద్రబాబుతోనే కలుస్తాడని చిరంజీవి తన సన్నిహితుల వద్ద చెబుతున్నట్లుగా తెలుస్తోందని పేర్కొన్నారు. ఇప్పుడు ఇది చర్చనీయాంశమైంది. ఈ విషయాన్ని చిరంజీవి తన సన్నిహితుల వద్ద చెబుతున్నట్లుగా తెలుస్తోందని పేర్కొన్నారు. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నాయో ఇది రాజకీయ వర్గాల్లోను చర్చకు దారి తీసింది.

     చిరంజీవి పదవిపై కూడా ప్రచారం

    చిరంజీవి పదవిపై కూడా ప్రచారం

    ఇదిలా ఉండగా, వచ్చే ఎన్నికల నాటికి చిరంజీవి, పవన్ కళ్యాణ్ చేతులు కలిపే అవకాశముందని, మెగాస్టార్ కాంగ్రెస్ పార్టీని వీడి జనసేన వైపు వస్తారని, ఆయనకు పార్టీలో తమ్ముడు కీలక పదవి ఇవ్వనున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. బాబుతో కలుస్తాడని చిరంజీవి చెబుతున్నారట అనే ప్రచారం ఓ వైపు, పవన్ - చిరు కలుస్తారని మరోవైపు సాగుతుండటం గమనార్హం.జనసేన పొత్తు గురించి చిరంజీవి మాట్లాడుతున్నారనే ప్రచారమే ఆసక్తిగా మారింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+