వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్టిక్కర్ సీఎం: చంద్రబాబుతో పోలుస్తూ జగన్‌పై పవన్ కళ్యాణ్ నిప్పులు

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసిన నిర్లక్ష్యం, అలసత్వాన్ని మీరు కొనసాగిస్తున్నారంటూ మండిపడ్డారు.

చంద్రబాబుకు ఏ మాత్రం తీసిపోని జగన్: ఏకిపారేసిన పవన్ కళ్యాణ్, కార్యాచరణ ప్రారంభంచంద్రబాబుకు ఏ మాత్రం తీసిపోని జగన్: ఏకిపారేసిన పవన్ కళ్యాణ్, కార్యాచరణ ప్రారంభం

జగన్ పాలన వైఫల్యాలపై..

జగన్ పాలన వైఫల్యాలపై..

సోషల్ మీడియా వేదికగా సీఎం జగన్మోహన్ రెడ్డి 100 రోజులపాలనపై విమర్శలు ఎక్కుపెట్టారు జనసేనాని. గతంలో చంద్రబాబు నాయుడు చేసిన పొరపాట్లనే సీఎం జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారని, ఎలాంటి తేడాలేదని మండిపడ్డారు. ఈ వందరోజులప పాలనలో ప్రభుత్వ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు.

చంద్రబాబుకు మీకు తేడా ఏంటీ..

చంద్రబాబుకు మీకు తేడా ఏంటీ..

చంద్రబాబు సర్కారు హయాంలో నిర్లక్ష్యంతో బోటు ప్రమాదం జరిగితే.. అదే నిర్లక్ష్యం, అలసత్వంతో సీఎం జగన్మోహన్ రెడ్డి సర్కారు కూడా కొనసాగిస్తోందన్నారు.
‘నాడు బాబు నిర్లక్ష్యం, నేడు జగన్ అలసత్వం: ప్రాణాలు పోకుండా చూడాల్సిన పాలకులు నెల రోజుల తరువాత బోటుని బయటకి తీయడమే గొప్ప విజయంగా చెప్పుకునే దుస్థితికి వచ్చింది. ఓట్లకి ఖరీదు కట్టే నాయకులకి ప్రజల ప్రాణాల విలువ ఏం తెలుస్తుంది!' అని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.

స్టిక్కర్ సీఎం..

ఇక మిగిలింది రైతుకు రంగులు వేయడం, మద్యం షాపులకు రంగులెయ్యడం మాత్రమే అంటూ జగన్ సర్కారుపై సెటైర్లు వేశారు జనసేనాని.

కక్ష సాధింపు చర్యలంటూ..

కక్ష సాధింపు చర్యలంటూ..

కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి రాష్ట్రంలో జనసేన నాయకులూ, శ్రేణులపై రాజకీయ కక్ష సాధింపులు పెరిగిపోయాయని ఆదివారం జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ అభిప్రాయపడింది. అక్రమ కేసులు దాఖలు చేస్తూ కక్ష సాధించడం ప్రజాస్వామిక ధోరణి కాదని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇలాంటి దాడులతో పార్టీ శ్రేణులను, నాయకులను భయపెట్టాలని పాలక వర్గమే భావిస్తే అంతకంటే అవివేకం మరొకటి ఉండదన్నారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం (సీపీఎస్) రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకువస్తామని చెప్పి.. ఇప్పుడు ఆ విషయాన్ని విస్మరించిన అంశంపై సమావేశంలో చర్చించారు. సీపీఎస్ రద్దు విషయంలో వైసీపీ వెనకడుగు వేసి, ఉద్యోగ వర్గాలను వంచించిందని రాజకీయ వ్యవహారాల కమిటీ స్పష్టం చేసింది. ‘రాష్ట్ర గతిని, ప్రగతిని తిరోగమనం పట్టించడంలో చంద్రబాబుకు ఏమాత్రం తీసిపోని విధంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్!' అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

English summary
Janasena Pawan Kalyan hits out at Andhra Pradesh CM YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X