పవన్ కళ్యాణ్ మాట తప్పడు.. మడమ తిప్పడు.. నిదర్శనమిదే!
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప్పాడ మత్స్యకారులకు వారి జీవితాలను మారుస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఉప్పాడ సి ప్రొటెక్షన్ వాల్ నిర్మిస్తానని ఉప్పాడ కొండపాక మధ్య తీరం పనులు ప్రారంభించామని ఇప్పటికే ఉప్పాడ మత్స్యకారులకు తెలిపారు. చేపల వేట పై ఆధారపడిన 7వేల 193 మంది మత్స్యకారుల కుటుంబాలకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి పవన్ కళ్యాణ్ వంద రోజుల యాక్షన్ ప్లాన్
మత్స్యకారుల సమస్యలను తెలుసుకుని ఆ సమస్యలను పరిష్కరించడానికి వంద రోజులు యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రణాళిక కింద మత్యకారుల సమస్యలను పరిష్కరించడంతో పాటు మత్స్యకారుల సంక్షేమం కోసం కృషి చేయనున్నారు. మత్స్య సంపదను పెంపొందించడానికి ఆధునిక పద్ధతుల పైన అధ్యయనం, అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం చేస్తున్నారు.

రెండు బృందాలుగా తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు మత్స్యకారులు
ఈ ప్రణాళికలో భాగంగా డిసెంబర్ 8వ తేదీన 60 మంది ఉప్పాడ మత్స్యకారులను రెండు బృందాలుగా తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు శిక్షణకు పంపారు. మూడు రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో స్థిరమైన ఆర్థిక అభివృద్ధిని సాధించే విధానాలపైన మత్స్యకారులకు అవగాహన కల్పించారు. అధునాతన కేజ్ కల్చర్, రీఫ్ కల్చర్, మార్కెటింగ్ వ్యవస్థల ఏర్పాటు పైన ప్రత్యేక శిక్షణను ఇచ్చారు.
ఈ అంశాలపై మత్స్యకారులకు ట్రైనింగ్
హార్బర్ ల సందర్శన, హేచరీలలో చేప గుడ్లు పొడిగించడం, ఆధునిక వలల తయారీ వంటి సాంకేతిక అంశాల పైన కూడా ఉప్పాడ మత్స్యకారులకు శిక్షణనిచ్చారు. మత్స్య సంపదతో మెరుగైన ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి అనుసరించాల్సిన ఆధునిక పద్ధతులపై ఇటు మత్స్యశాఖ అధికారులు కూడా విస్తృత అధ్యయనం జరిపారు.
తమిళనాడు బృందం నేర్చుకున్నది ఇవే
తమిళనాడు పర్యటనకు వెళ్లిన బృందానికి చెన్నైలో మండపం వద్ద ఉన్న csmcri లో కృత్రిమ సహజ పద్ధతులలో కేజ్ కల్చర్. రీఫ్ కల్చర్ సాగుపైన శిక్షణ తరగతులు నిర్వహించారు. సముద్ర వనరుల దీర్ఘకాలిక సంరక్షణకు అనుసరించాల్సిన శాస్త్రీయ విధానాలపైన కూడా వారికి స్పష్టమైన అవగాహన కల్పించారు. కోల్డ్ స్టోరేజ్, చేపలఅమ్మకాలు, మత్స్య సంపద గ్రేడింగ్, వ్యర్ధాల నిర్వహణ, వేలం, సప్లై చైన్ వంటి అత్యాధునిక సదుపాయాలపైన వారికి అవగాహన కల్పించారు.
కేరళ బృందం నేర్చుకుంది ఇదే
మరోవైపు కేరళ వెళ్ళిన బృందానికి చేపల వేటలో సాంకేతికత వినియోగం , స్థిరమైన ఆదాయం, లాభదాయక విధానాలపై శిక్షణనిచ్చారు. మత్స్యకారులను అన్ని విధాలుగా సుశిక్షితులను చేసి వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం వంద రోజులలో వారికి న్యాయం చేయడానికి శ్రమ పడుతున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి వాళ్ల తలరాత మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications