ప్రత్యేక హోదాపై పవన్ కల్యాణ్ ప్లాన్ ఇదీ: ప్రచార హోరు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌ను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన కార్యాచరణను రూపొందించింది.

ప్రచారం ద్వారా ప్రజా మద్దతు కూడగట్టుకోవాలనే ఉద్దేశంతో పవన్ కల్యాణ్ ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయ విద్యార్థులకు టీషర్టులు పంపిణీ చేయాలని నిర్ణయించారు.

 టీ షర్టుపై ఇలా ముద్రించారు...

టీ షర్టుపై ఇలా ముద్రించారు...

విద్యార్థులకు పంపిణీ చేే టీషర్టులపై ప్రత్యేక హోదా - ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని ముద్రించారు. పవన్ కల్యాణ్ ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను అందించినట్లు తెలుస్తోంది.

 విద్యార్థి విభాగం విధివిధానాలు...

విద్యార్థి విభాగం విధివిధానాలు...

పవన్ కల్యాణ్ సూచనతో ప్రత్యేక హోదా పోరాటాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్లాలనే వి,యంపై జనసేన విద్యార్థి విభాగం విధివిధానాలను రూపొందించింది. ప్రత్యేక హోదాపై యువతను పెద్ద యెత్తున కదిలించేందుకు అవసరమైన ప్రయత్నాలకు పదును పెడుతోంది.

 డిజిటల్ ఉద్యమంపై దృష్టి

డిజిటల్ ఉద్యమంపై దృష్టి

యువత ఎక్కువగా సోషల్ మీడియాను వాడుతున్న విషయం తెలిసిందే. దాంతో జనసేన డిజిటల్ ఉద్యమానికి శ్రీకారం చుట్ిది. భగత్‌సింగ్ స్టూడెంట్స్ యూనియన్ పేరుతో జనసేన విద్యార్థి విభాగాన్ని ఏర్పాటు చేసింది.

 ప్రత్యేక హోదా కోసం పవన్

ప్రత్యేక హోదా కోసం పవన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి పవన్ కల్యాణ్ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు సూచిస్తూ అవసరమైన మద్దతును తాను కూడగడుతానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+