• search

అభిమానుల హడావుడి: పవన్ కళ్యాణ్‌కు చుక్కలు చూపిన ఫ్యాన్స్, తలపట్టుకున్న పోలీసులు

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలో గురువారం బౌన్సర్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. పవన్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు. వారి పట్ల బౌన్సర్లు కఠినంగా వ్యవహరించారు. దీంతో కొందరు గాయపడ్డారు. బౌన్సర్ల తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

   Pawan Kalyan Over Allegations on PRP In Public Meeting

   రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఉభయ గోదావరి జిల్లాల జనసేన కార్యకర్తల సమావేశం ఉత్సాహంగా సాగింది. పవన్ కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ ఉద్వేగంగా మాట్లాడారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎంపిక చేసిన 1000 మంది కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.

   చదవండి: పవన్ కళ్యాణ్! దాని గురించి మాట్లాడు: రోజా దిమ్మతిరిగే షాక్, వాణీ విశ్వనాథ్‌పై సై

   చదవండి: పరకాలా! చిరు నోరులేనివాడు, ఆ రోజు నేనే ఉండిఉంటే, భార్యను కూర్చోబెట్టావ్: పవన్, జగన్‌పైనా

   చదవండి: చిరంజీవిని నాశనం చేశావ్, ఏంచేశాడంటే: పవన్ కళ్యాణ్‌పై రోజా షాకింగ్, అల్లు అరవింద్‌పైనా (వీడియో)

   ప్రజారాజ్యం అనుభవాలు

   ప్రజారాజ్యం అనుభవాలు

   పార్టీ లక్ష్యాలు, రాజకీయాల్లో ప్రజారాజ్యం నుంచి నేర్చుకున్న గత అనుభవాలు, నేర్చుకున్న పాఠాలను వివరిస్తూ భవిష్యత్తులో పార్టీ అనుసరించాల్సిన విధానాల గురించి మాట్లాడారు. డబ్బుంటేనే రాజకీయ పార్టీలు నడుస్తాయన్నది అపోహే అన్నారు. ప్రజలకు మంచి చేయాలన్న లక్ష్యంతోనే జనసేన ముందుకెళ్తున్నట్లు చెప్పారు.

   ఏదైనా సాధించాలనుకున్నప్పుడు

   ఏదైనా సాధించాలనుకున్నప్పుడు

   పార్టీ ఆశయాలను అన్ని గ్రామాలకూ తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. క్రమశిక్షణ గల కార్యకర్తలే తన బలం అని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఏదైనా సాధించాలనుకున్నప్పుడు స్పష్టమైన విధానం, సాధ్యాసాధ్యాలపై చర్చల ద్వారా ముందుకెళ్లాలి తప్ప అనవసర రాద్ధాంతం వల్ల ప్రయోజనం ఉండదని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు.

   పవన్ కళ్యాణ్! దాని గురించి మాట్లాడు: రోజా దిమ్మతిరిగే షాక్, వాణీ విశ్వనాథ్‌పై సై

   బుధవారం రాత్రి నుంచి అభిమానుల హడావుడి

   బుధవారం రాత్రి నుంచి అభిమానుల హడావుడి

   పవన్ బుధవారం రాత్రి రాజమహేంద్రవరం హోటల్ చేరుకున్నారు. అప్పటి నుంచి అభిమానుల తాకిడి ప్రారంభమైంది. రాత్రి నుంచే ఆయన బస చేసిన హోటల్‌ వద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో వారిని నిలువరించడం పోలీసులకు కష్టంగా మారింది. గురువారం ఉదయం సైతం అదే పరిస్థితి చోటుచేసుకోవడంతో ఓ సందర్భంలో తోపులాట జరిగింది. దీంతో మధ్యాహ్నానికి పోలీసులు కట్టుదిట్టంగా భద్రత చేపట్టారు.

   పరకాలా! చిరు నోరులేనివాడు, ఆ రోజు నేనే ఉండిఉంటే, భార్యను కూర్చోబెట్టావ్: పవన్, జగన్‌పైనా

   ఆహ్వానం అందిన కార్యకర్తలు వెళ్లలేని పరిస్థితి

   ఆహ్వానం అందిన కార్యకర్తలు వెళ్లలేని పరిస్థితి


   అయితే, కార్యకర్తల భేటీ సందర్భంగా బౌన్సర్లు కొంత అత్యుత్సాహం చూపించారు. కొందరు అభిమానులు గాయపడ్డారు. సభా మందిరం వద్ద నగర జనసేన నాయకులు ప్రణాళికతో వ్యవహరించలేదని అందుకే ఇలా జరిగిందని చెబుతున్నారు. దీంతో ఆహ్వానం అందిన కొందరు కార్యకర్తలకు కూడా లోపలకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది.

   చుక్కలు చూపిన ఫ్యాన్స్, తల పట్టుకున్న పోలీసులు

   చుక్కలు చూపిన ఫ్యాన్స్, తల పట్టుకున్న పోలీసులు

   సభ మధ్యాహ్నం ఒకటి గంటలకు ప్రారంభమవుతుందని ప్రకటించారు. దీంతో ఆహ్వానం అందిన కార్యకర్తలు వచ్చారు. వారికి అభిమానులు అడ్డుగా ఉండడంతో పలికి వెళ్లేందుకు ఇబ్బంది పడాల్సి వచ్చింది. పవన్‌ను చూసేందుకు లోపలకు వెళ్తామని అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. ఓ దశలో లాఠీఛార్జ్ కూడా చేశారు. అయినా అభిమానులు ఆగకపోవడంతో ఓ సమయంలో తలుపులు తెరిపించి పవన్‌ను దూరం నుంచి చూపించారు. ఆయన లోపల మాట్లాడుతున్నంత సేపు పవన్ అంటూ నినాదాలు చేస్తూ లోపలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు.

   రంగంలోకి రైల్వే పోలీసులు,

   రంగంలోకి రైల్వే పోలీసులు,

   పవన్‌ బయటకు వెళ్లే సమయంలో అతడిని చూడడానికి అభిమానులు రివర్ బే ఎదురుగా రైల్వే ట్రాకు, సమీపంలోని చెట్లపైకి ఎక్కారు. రైళ్ల రాకపోకలకు ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వ రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని బందోబస్తు నిర్వహించారు.

   పవన్ కాన్వాయ్ ఆపేందుకు ప్రయత్నించిన ఫ్యాన్స్

   పవన్ కాన్వాయ్ ఆపేందుకు ప్రయత్నించిన ఫ్యాన్స్

   చాలామంది అభిమానులు పవన్ హోటల్ నుంచి పోలవరంకు బయలుదేరగా.. ఆయనను కలుసుకునేందుకు ఆరాటపడ్డారు. రివర్ బే హోటల్ నుంచి బయలుదేరి రోడ్డు కం రైలు వంతెన పైకి చేరుకునే లోపు అభిమానులు పెద్ద ఎత్తున రైల్వే ట్రాకు దాటుకొని వంతెన పైకి చేరి పవన్ కాన్వాయ్‌ని ఆపేందుకు ప్రయత్నించారు. వారిని ఆపేందుకు పోలీసులు ఇబ్బంది పడ్డారు.

   తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

   English summary
   Pawan Kalyan Jana Sena Public Meeting at Rajamahendravaram on Thursday.

   Oneindia బ్రేకింగ్ న్యూస్
   రోజంతా తాజా వార్తలను పొందండి

   X
   We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more