పవన్ కళ్యాణ్! దాని గురించి మాట్లాడు: రోజా దిమ్మతిరిగే షాక్, వాణీ విశ్వనాథ్‌పై సై
Recommended Video

అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా కౌంటర్ గురువారం ఇచ్చారు. జగన్ పైనా, వైసీపీ పైన చేసిన వ్యాఖ్యలకు గాను ఆమె స్పందించారు.
చిరంజీవి లేకుంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎక్కడ అని ఆమె ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కోసం గతంలో ఆయన పిలుపునిచ్చారని, ఇప్పుడు దాని గురించి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. పవన్ కళ్యాణ్‌కు తమ పార్టీ అధినేత జగన్ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.

జగన్‌ను తప్పుబట్టిన పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ బుధవారం నాటి తన విశాఖ పర్యటనలో జగన్ పైన తీవ్రవిమర్శలు చేసిన విషయం తెలిసిందే. తండ్రి చనిపోగానే ముఖ్యమంత్రి కావాలనుకోవడం విడ్డూరమని, జగన్ తీరు సరికాదని, అలాగే ప్రతి సమస్యకు అధికారంతో ముడిపెట్టడం ఏమిటని ప్రశ్నించారు. తాను అధికారంలకోి వస్తే సమస్యలు పరిష్కరిస్తాననే ధోరణిని మానుకోవాలని హితవు పలికారు.

జగన్ తర్వాత రోజా కౌంటర్
దీనిపై ఆ వెంటనే జగన్ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబును విమర్శించరని, ఆయనకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వచ్చి అంత ఇంత మేలు చేసే దిశగానే ఇంతరవరకు ఆయన ప్రస్థానం కనిపించిందని కౌంటర్ ఇచ్చారు. పవన్ మొదట చంద్రబాబు నీడ నుంచి బయటకు రావాలన్నారు. చంద్రబాబు మోసం, అన్యాయం చేసే వ్యక్తి అని ఆయన రియలైజ్ అయితే, గమనించగలిగితే ఆ రోజు డిఫరేంట్ బాల్ గేమ్ అవుతుందన్నారు. ఇప్పుడు రోజా కౌంటర్ ఇచ్చారు.

సినిమా వారసత్వాలపై మాట్లాడు
పవన్ కళ్యాణ్‌కు వారసత్వ రాజకీయాలపై మాట్లాడే హక్కు లేదని రోజా అన్నారు. ఆయన మొదట వారసత్వ సినిమాలపై మాట్లాడాలని దిమ్మతిరిగే షాకిచ్చారు. ఆయన అన్నయ్య లేకుంటే పవన్ కళ్యాణ్ లేడు కాబట్టి, వారసత్వ సినిమాలపై మాట్లాడాలన్నారు. జగన్.. వైయస్ కొడుకుగా వచ్చినప్పటికీ తర్వాత తనను తాను నిరూపించుకున్నారని చెప్పారు.

చంద్రబాబు, లోకేష్‌లపై రోజా ఆగ్రహం
చంద్రబాబు, లోకేష్‌ల పైనా ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. చంద్రబాబు అన్నీ అబద్దాలే చెబుతారన్నారు. అసెంబ్లీలో వారి నటనకు నంది అవార్డులు ఇవ్వవచ్చునని ఆమె ఎద్దేవా చేశారు. వారిద్దరిని చూశాక మాలాంటి నటులు అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. అలా నటిస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టు అని చెప్పారు. కమీషన్ల కోసమే ఈ ప్రాజెక్టు కడుతున్నారన్నారు. పోలవరంపై కేంద్రాన్ని నిలదీయాలన్నారు. జాతీయ ప్రాజెక్టు అన్నప్పుడు రూ.30వేల కోట్లు రాష్ట్రం ఎందుకు భరించాలన్నారు.

వాణీ విశ్వనాథ్‌పై పోటీకి సిద్ధం
ప్రముఖ నటి వాణీ విశ్వనాథ్ తెలుగుదేశం పార్టీలో చేరి, ఆ తర్వాత తనపై పోటీ చేసినా తాను కూడా సిద్ధంగా ఉన్నానని రోజా చెప్పారు. గతంలో వాణీ విశ్వనాథ్ మాట్లాడుతూ.. తాను రోజాపై పోటీకి సిద్ధమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రోజా స్పందించారు.












Click it and Unblock the Notifications