చచ్చిపోయారు: కాకినాడ సభలో జనసేనాని పవన్ తీర్మానాలివే

అమరావతి: కాకినాడ సభలో అటు బీజేపీని, ఇటు టీడీపీని చీల్చి చెండాడిన జనసేనాని పవన్ కళ్యాణ్ తన తీర్మానాలను ప్రజల ముందుంచారు. ఆ తీర్మానాలేంటంటే జై ఆంధ్ర ఉద్యమ సమయంలో 400 పై చిలుకు బలిదానాలు జరిగాయన్నారు. చనిపోయిన వారి కోసం స్మారక స్థూపం ఏర్పాటు చేయాలన్నారు.

సీమాంధ్ర బలిదానాలకు స్మారక స్ధూపం లేదని, చనిపోయిన అమరవీరులను తెలుగు దేశం ప్రభుత్వం గౌరవించాలన్నారు. కర్నూలులో గానీ, రాబోయే అమరావతిలో గానీ స్మారక స్థూపం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వెంకయ్య నాయుడు గారు మీకొక సంగతి తెలుసా? అని ప్రశ్నించారు.

Pawan Kalyan Kakinada Speech Live Streaming Starts from 3 PM

తన అమ్మకు దూరపు బంధువైన మేనత్త కుమారుడి బిడ్డను వెంకయ్య నాయుడు పొట్టనబెట్టుకున్నారయ్యా అని చెప్పేదన్నారన్నారు. జై ఆంధ్ర ఉద్యమంలో భాగంగా విశాఖపట్నం విద్యార్ధి ఉద్యమాల్లో మీరున్నప్పుడు మీ ఆవేశపూరిత ప్రసంగాలకు 200 మంది పిల్లలు రోడ్లపైకి వచ్చిన చచ్చిపోయారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో మీ తప్పుడు విధానాల వల్లే తెలంగాణ ప్రజలు చాలా మంది తన ఇంటికి వచ్చి తిట్టారన్నారు. వారంతా నాలో చంద్రబాబు నాయుడు, రాజశేఖరరెడ్డిని చూసుకున్నారన్నారు. 1972లో మీరిచ్చిన మాటలకు హైదరాబాద్‌లోని సీమాంధ్ర నాయకులు మాటలు పడ్డారన్నారు.

1972లో మీరు ఇచ్చిన మాటకు హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర ప్రజలు తిట్లు కాశారన్నారు. హైదరాబాద్‌లో నివసిస్తోన్న సీమాంధ్ర ప్రజలు ఇప్పటికీ అర్ధరాత్రి ఏం జరుగుతుందోనని భయపడతూనే ఉన్నారన్నారు. ముందు ముందు రాజకీయాలు చేయబోయే రోజుల్లో మేనిఫెస్టోలు పెట్టే ముందు చేయగలిగినవే మాత్రమే పెట్టండని సూచించారు. బీజేపీ నేతలు చాలా తప్పులు చేశారన్నారు.

మిమ్మల్ని ఈ రెండు సంవత్సరాలు ఇబ్బంది పెట్టగలనన్నారు. ఇప్పటికైనా మేలుకొని న్యాయం చేస్తారా? ఇలాగే ఉంటారనేది మీ చేతిలోనే ఉందని బీజేపీ నేతలను ఉద్దేశించి అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇక్కడికి వచ్చి మాట్లాడతారని, రాబోయే రోజుల్లో బీజేపీ గానీ, కాంగ్రెస్ నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సభను ముగించపోయే ముందు ఒక్కటే అడుగుతున్నానని అన్న పవన్ మనం కూడా భారతీయులమేనని కార్గిల్‌లో చనిపోయిన సైనికులను ఎలాగైతే ఉత్తర భారతంలో గౌరవిస్తారో, అదే విధంగా మన మాతృభూమికి జైహింద్ చెప్పి సెలవు తీసుకుందామన్నారు.

చివరగా
భారత్ మాతాకీ జై
జై హింద్
జై హింద్
జై హింద్ అంటూ తన పవన్ తన ప్రసంగాన్ని ముగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+