గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జనసేన ఆవిర్భావ సభ: పొత్తులు, పోటీ చేసే స్థానాలపై వవన్ కీలక ప్రకటన?

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: మార్చి 14న, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో భవిష్యత్ రాజకీయ ప్రణాళికలను ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏ రకమైన ప్రకటన చేస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. రెండు రాష్ట్రాల్లో పోటీ చేసే స్థానాల విషయమై స్పష్టతను ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.

జగన్ కాంగ్రెస్‌లో ఉంటే తెలంగాణ ఏర్పడేది కాదేమో, వ్యూహల్లో బాబు దిట్ట: మేకపాటిజగన్ కాంగ్రెస్‌లో ఉంటే తెలంగాణ ఏర్పడేది కాదేమో, వ్యూహల్లో బాబు దిట్ట: మేకపాటి

2014 ఎన్నికలకు ముందు సినీ నటుడు పవన్ కళ్యాన్ జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. ఆ ఎన్నికల సమయంలో టిడిపి, బిజెపి కూటమికి పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిడిపికి, కేంద్రంలో ఉన్న బిజెపికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ పలు సభల్లో విమర్శలు గుప్పించారు.

రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేల ఓటు మాకే: ఆదిరాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేల ఓటు మాకే: ఆది

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నారు.కేంద్రం నుండి ఏపీ రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయాన్ని లెక్కలు తేల్చేందుకు జెఎప్‌సి ఏర్పాటు చేశారు.

జనసేన చీఫ్ కీలక ప్రకటన చేసే అవకాశం

జనసేన చీఫ్ కీలక ప్రకటన చేసే అవకాశం

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని భవిష్యత్ ప్రణాళికను జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించే అవకాశం ఉంది. 2019 ఎన్నికల్లో పార్టీ ఏ రకమైన ఎన్నికల వ్యూహన్ని అనుసరిస్తోందనే విషయమై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఏ పార్టీలతోనైనా పొత్తులుంటాయా అనే విషయమై కూడ స్పష్టత ఇచ్చే అవకాశం లేకపోలేదని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

విభజన హమీలపై న్యాయపోరాటం చేయనుందా

విభజన హమీలపై న్యాయపోరాటం చేయనుందా

విభజన హమీలపై టిడిపి న్యాయపోరాటం చేసే అవకాశం కూడ లేకపోలేదనే ప్రచారం కూడ జనసేన వర్గాలు చెబతున్నాయి. 2014 ఎన్నికల సమయంలో ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన హమీలను అమలు చేయాలని జనసేన పట్టుబట్టాలని భావిస్తోంది. ఇటీవల కాలంలో కేంద్రం నుండి రాష్ట్రానికి ఇచ్చిన నిధుల విషయంలో లెక్కలను తేల్చేందుకు జెఎప్‌సిని ఏర్పాటు చేసింది. విభజన హమీలను అమలు విషయమై న్యాయపోరాటం చేసే యోచనలో కూడ జనసేన ఉందనే ప్రచారం కూడ సాగుతోంది.

టిడిపి, బిజెపిలపై ఏ వైఖరిని తీసుకొంటారు

టిడిపి, బిజెపిలపై ఏ వైఖరిని తీసుకొంటారు


టిడిపి, బిజెపిలపై పవన్ కళ్యాణ్ ఏ వైఖరిని తీసుకొంటారనేది ఈ సభతో మరింత స్పస్టత రానుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీ ప్రజలకు ఇచ్చిన హమీల అమలు విషయంలో టిడిపి, బిజెపిలు అనుసరించిన విధానాలపై జనసేనాని పలు మార్లు బహిరంగంగానే విమర్శలను ఎక్కుపెట్టారు. ప్తత్యేక హోదా విషయం, పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీల తీరు తదితర అంశాలపై ఈ రెండు పార్టీల తీరుపై పవన్ కళ్యాణ్ పార్టీ వైఖరిని ఈ సభలో ప్రకటన చేసే అవకాశం ఉంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేసే స్థానాల ప్రకటన

రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేసే స్థానాల ప్రకటన

రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తోందనే విషయాలపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటన చేసే అవకాశం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే ఎన్ని స్థానాల్లో జనసేన పోటీ చేస్తోందనే విషయాలపై ఈ సభ ద్వారా ప్రకటన వచ్చే అవకాశం ఉందని జనసేన వర్గాల్లో ప్రచారంలో ఉంది.

English summary
Janasena chief Pawan kalyan likely to announce its party future plan on March 14Janasena formation day meeting will be held on March 14 at Guntur
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X