పిఠాపురం మహిళలను మరచిపోని పవన్ కళ్యాణ్..వారికి రాఖీ స్పెషల్ గిఫ్ట్‌లు!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఎన్ని పనుల్లో బిజీగా ఉన్నా, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నా పిఠాపురం నియోజకవర్గ ప్రజలను మాత్రం అసలే మరచిపోరు. పిఠాపురం అభివృద్ధికి నిరంతరం పని చేస్తూనే, పిఠాపురంలో మహిళల రక్షణ, సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ఎప్పటిలాగే ఆయన నియోజకవర్గంలో వితంతు మహిళలకు తాను అండగా ఉంటానని వెల్లడించారు.
రాఖీకి పవన్ నియోజకవర్గంలోని మహిళలకు ప్రత్యేక కానుకలు
రాఖీ పౌర్ణమి సందర్భంగా తన నియోజకవర్గంలోని మహిళలకు ప్రత్యేక కానుకలు పంపించారు. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన సుమారు 1,500 మంది వితంతు మహిళలకు చీరలను రాఖీ పండుగ బహుమతిగా అందజేశారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఈ చీరలను పంపగా, స్థానిక జనసైనికులు ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు. పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమం ద్వారా వితంతు మహిళలకు సోదరుడిగా తాను ఉన్నానని భరోసా కల్పించారు.

వారిలో ఆత్మస్థైర్యం నింపేలా పవన్
కుటుంబ సభ్యుడిగా, సోదరుడిగా వారిని గౌరవిస్తూ ఈ కానుకలు పంపినట్లు ఆయన వారికి తన సందేశం అందజేశారు. వారిలో ఆత్మస్థైర్యం నింపేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ కార్యకర్తలను ఆదేశించారు. మహిళలు ఈ అనూహ్య కానుకకు ధన్యవాదాలు తెలిపి ఆనందం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ గతంలోనూ పిఠాపురం మహిళలకు అనేకసార్లు చీరలు, పసుపు, కుంకుమ వంటి కానుకలు అందించారు.
గతంలోనూ పవన్ కళ్యాణ్ మహిళలకు బహుమతులు, చిన్నారులకు సాయం
శ్రావణ మాసం సందర్భంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాల్లో పాల్గొనే వేలాది మంది ఆడపడుచులకు తన సొంత ఖర్చుతో చీరలు పంపిణీ చేశారు. కొన్ని సందర్భాల్లో 10 వేల నుంచి 14 వేల మంది వరకు మహిళలకు ఇలాంటి బహుమతులు అందజేశారు. అనాథ పిల్లలకు ఆర్థిక సాయం అందించడం వంటి కార్యక్రమాలు కూడా చేపట్టారు.
పవన్ కళ్యాణ్ బహుమతులు.. మహిళలకు ఒక గొప్ప భరోసా
పవన్ కళ్యాణ్ ఈ తరహా చర్యలు నియోజకవర్గ ప్రజలతో, ముఖ్యంగా మహిళలతో ఆయనకు ఉన్న సన్నిహిత బంధాన్ని తెలియజేస్తున్నాయి. ఎమ్మెల్యేగా, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే స్థానికుల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు నియోజకవర్గంలో మహిళలకు ఒక గొప్ప భరోసా, అందించటానికి దోహదం చేస్తాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి.












Click it and Unblock the Notifications