మెడికో ప్రీతి మృతి ఘటన: హృదయం ద్రవించిందన్న పవన్ కళ్యాణ్; విద్యార్థులకు క్లాస్!!
మెడికో ప్రీతి మృతిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. ఈ ఘటనతో తన హృదయం ద్రవించిందన్నారు. కాలేజీల్లో ర్యాగింగ్ చేస్తున్న విద్యార్థులకు పవన్ కల్యాణ్ క్లాస్ తీసుకున్నారు..
వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల అనస్తీషియా పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి మృతి ప్రతి ఒక్కరి మనసులను కలచివేస్తుంది. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులను తట్టుకోలేక ప్రీతి ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రంలో ర్యాగింగ్ పై చర్చకు కారణంగా మారింది. హానికరమైన ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యయత్నం చేసిన ప్రీతి ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాడి చివరకు నిన్న రాత్రి తుది శ్వాస విడిచింది. ఇక ఈ ఘటనపై ప్రతిపక్ష పార్టీలు తెలంగాణా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇక తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

ఆ విషయాలు తెలిసి హృదయం ద్రవించింది: పవన్ కళ్యాణ్
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో చదువుతున్న పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతిమరణ అత్యంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు. మృత్యువుతో పోరాడి కీర్తి తన తుది శ్వాస విడిచిందని, ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని పవన్ కళ్యాణ్ తెలియజేశారు జనసేన ని పవన్ కళ్యాణ్. సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేక డాక్టర్ ప్రీతి బలవన్మరణానికి పాల్పడ్డ పరిస్థితులు, కన్నవారి మానసిక వేదన గురించి తెలుసుకుంటే హృదయం ద్రవించిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

సరైన రీతిలో స్పందించి ఉంటే ఇలా జరిగేది కాదన్న పవన్ కళ్యాణ్
తమ బిడ్డను సైఫ్ వేధిస్తూ కించపరుస్తూ ఉన్నాడని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన వెంటనే కాలేజీ బాధ్యులు సరైన రీతిలో స్పందించి ఉంటే ఇటువంటి దురదృష్టకరమైన పరిస్థితి వచ్చేది కాదన్నారు. డాక్టర్ ప్రీతి ఆత్మహత్యకు కారకుడైన నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. కళాశాలలో ముఖ్యంగా మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్, వేధింపులు అరికట్టడం పైన ప్రభుత్వం కఠినమైన వైఖరిన అవలంబించాలని పవన్ కళ్యాణ్ సూచించారు.

సీనియర్ విద్యార్థుల ఆలోచనా ధోరణి మారాలి
సీనియర్ విద్యార్థుల ఆలోచనా ధోరణి మారాలని, కొత్తగా కాలేజీలోకి అడుగుపెట్టిన వారిని స్నేహపూర్వకంగా హక్కును చేర్చుకుని తమ కుటుంబ సభ్యుల మాదిరిగా ఆదరించాలన్నారు పవన్ కళ్యాణ్. అందుకు భిన్నంగా వేధింపులకు పాల్పడడం ఆధిపత్య ధోరణి చూపించడం రాక్షసత్వం అవుతుందని గ్రహించాలంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

జనగామ జిల్లాలోని స్వగ్రామంలో ప్రీతి అంత్యక్రియలు.. భారీ బందోబస్తు
ఇదిలా ఉంటే నేడు ప్రీతి అంత్యక్రియలు వారి స్వగ్రామమైన జనగామ జిల్లా మొండ్రాయి గిర్ని తండాలో నిర్వహించనున్నారు. ప్రీతి మృతదేహం జనగామ జిల్లా మొండ్రాయి గిర్ని తండాకు చేరుకుంది. ఇక భారీ బందోబస్తు మధ్య ప్రీతి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ప్రీతి మృతితో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. మరోపక్క వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వద్ద, కేఎంసీ కళాశాల వద్ద భారీగా మోహరించిన పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. నేడు విద్యార్థి సంఘాలు బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. ప్రీతి మృతితో ప్రీతి స్వగ్రామం అయిన గిర్ని తండాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రీతి మృతికి కారణం అయిన సైఫ్ ను ఉరి తీయాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
-
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!!












Click it and Unblock the Notifications