ఆయనకు పేకాట క్లబ్బులపైనే శ్రద్ధ ... మంత్రి కొడాలి నానీపై పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గుడివాడ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానీ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్ లను కలిసి వినతి పత్రాలు ఇవ్వాలని పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్ అందులో భాగంగా ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు.

 రైతులకు న్యాయం జరిగేందుకు ఎంతవరకైనా పోరాటం చేస్తానన్న పవన్ కళ్యాణ్

రైతులకు న్యాయం జరిగేందుకు ఎంతవరకైనా పోరాటం చేస్తానన్న పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో రైతులకు న్యాయం జరిగేందుకు ఎంతవరకైనా పోరాటం చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు . దాష్టీకం చేసే ఏ ప్రజా ప్రతినిధులు అయినా జనసేన బలంగా ఎదుర్కొంటుందని పేర్కొన్న పవన్ కళ్యాణ్ కంకిపాడు మీదుగా గుడివాడ చేరుకుని అక్కడ నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలోని నివర్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన పవన్ కళ్యాణ్ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కృష్ణాజిల్లా గుడివాడ, మచిలీపట్నం లో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుడివాడలో మంత్రి కొడాలి నాని పై విరుచుకుపడ్డారు.

పేకాట క్లబ్ లపై ఉన్న శ్రద్ధ గుడివాడలో రోడ్లు బాగు చేయడంలో లేదన్న పవన్ కళ్యాణ్

పేకాట క్లబ్ లపై ఉన్న శ్రద్ధ గుడివాడలో రోడ్లు బాగు చేయడంలో లేదన్న పవన్ కళ్యాణ్

పేకాట క్లబ్ లపై ఉన్న శ్రద్ధ గుడివాడలో రోడ్లు బాగు చేయడంలో లేదని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు . గుడివాడ ప్రజలు రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ఎమ్మెల్యేను నిలదీయాలని పవన్ కళ్యాణ్ అన్నారు. గుడివాడ ఎమ్మెల్యే కు పేకాట క్లబ్ లో నిర్వహించిన ఉన్న సమర్ధత, ప్రజా పాలన ముందుకు తీసుకెళ్లడంలో లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. అంతేకాదు ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా నోటిదురుసు చూపిస్తున్నారు అంటూ మండిపడ్డారు.

నోటి దురుసు చూపించే ఎమ్మెల్యేలను జనసేన బలంగా ఎదుర్కొంటుందన్న పవన్ కళ్యాణ్

నోటి దురుసు చూపించే ఎమ్మెల్యేలను జనసేన బలంగా ఎదుర్కొంటుందన్న పవన్ కళ్యాణ్

ఒక వర్గానికి చెందిన మీడియా సంస్థలో తన ఇష్టమొచ్చినట్టుగా దురుసుగా మాట్లాడితే కుదరదని పవన్ కళ్యాణ్ కొడాలి నాని నోటిదురుసుతనాన్ని హెచ్చరించారు . నోటి దురుసు చూపించే ఎమ్మెల్యేలను జనసేన బలంగా ఎదుర్కొంటుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తన అంతిమ శ్వాస ఉన్నంత వరకు ప్రజలకు అండగా ఉంటానని జనసేనాని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రజలను భయపెట్టి పాలిద్దామంటే, ఇక్కడ భయపడడానికి ,భరించడానికి ఎవరూ సిద్ధంగా లేరని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. రోడ్లు అస్తవ్యస్తంగా అధ్వానంగా ఉన్నాయని, ఎమ్మెల్యేల పనితీరులో మార్పు రావాలని, అందరికీ న్యాయం జరగాలని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+