దటీజ్ పవన్ కళ్యాణ్: 'అన్నయ్య' మెచ్చిన 'తమ్ముడు' రాజకీయం

కాకినాడ: ఇతర రాజకీయ పార్టీల సభలకు, జనసేన పార్టీ సభలకు తేడా కనిపిస్తోంది. ఏ రాజకీయ పార్టీ సమావేశం, బహిరంగ సభ జరిగినా పార్టీ ముఖ్యులు పలువురు వేదిక పైన కూర్చుంటారు. కానీ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన అందుకు భిన్నంగా కనిపిస్తోంది.

ఆవేశంపై చిరంజీవి

ఆవేశంపై చిరంజీవి

మిగతా రాజకీయ పార్టీలకు, నాయకులకు అలాగే జనసేనకు, పవన్ కళ్యాణ్‌కు తేడా కనిపిస్తోందని అంటున్నారు. మిగతా నాయకుల్లో ఆవేశం ఉన్నప్పటికీ వ్యూహాత్మక వైఖరి కనిపిస్తోంది. కానీ పవన్‌కు ఆవేశం మాత్రమే తెలుసునని, ఆ ఆవేశంలో నిజాయితీ ఉందనే వారే చాలా మంది ఉన్నారు. స్వయంగా ఆయన సోదరుడు చిరంజీవి కూడా అలాంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. తామిద్దరిది వేరు దారి అయినా జనాలకు ఏదో చేయాలనే తపన తన తమ్ముడిలో ఉంటుందని చెప్పారు.

విపక్షాల విమర్శలు

విపక్షాల విమర్శలు

విమర్శల పైన ఇతర పార్టీల నాయకులు దూకుడుగా వ్యవహరిస్తుంటారు. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్‌లో భిన్నత్వం కనిపిస్తోంది. ఇటీవల రోజాకు ఇచ్చిన కౌంటరే అందుకు నిదర్శనం. పడతామబ్బా.. ఎన్ని తిట్టినా పడతాం అని వ్యాఖ్యానించారు. పంచ్ డైలాగులు అనుకోకుండా చెబుతారు.

అందరికీ షాకిస్తూ.. సోషల్ మీడియా నుంచి రోడ్డెక్కే వరకు

అందరికీ షాకిస్తూ.. సోషల్ మీడియా నుంచి రోడ్డెక్కే వరకు

2014 సార్వత్రిక టిడిపి - బిజెపికి మద్దతు పలికిన పవన్ కళ్యాణ్ తొలుత సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాలను ప్రశ్నించారు. అడపాదడపా బయటకు వచ్చారు. ప్రశ్నించారు. అప్పుడప్పుడు వచ్చి ప్రశ్నించడం, సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించడంపై విమర్శలు వచ్చాయి. అయితే, అందరికీ షాకిస్తూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి రాజకీయ రంగ ప్రవేశం చేసినట్లుగా కనిపిస్తోంది.

వేదిక పైన ఒక్కడే

వేదిక పైన ఒక్కడే

తిరుపతి జనసేన సభ కొంచెం భిన్నంగా జరిగింది. కాకినాడ సభ కూడా అలాగే జరగనుంది. రాజకీయ సభలు అంటే ఆలస్యం ఉంటుంది. కానీ పవన్ తిరుపతి సభ దాదాపు అనుకున్న సమయానికే ప్రారంభమైంది. వేదిక పైన పవన్ కళ్యాణ్ ఒక్కరు తప్ప మరెవరూ లేరు.

పవర్ పంచ్‌లు

పవర్ పంచ్‌లు

తనది భజన సేన అన్న వారికి పవన్ కళ్యాణ్.. అవును తనది భజన సేననే అని, అయితే జనాలకు భజన చేసే సేన అని, అలాగే తనను రబ్బర్ స్టాంప్ అన్న రోజా పైన.. పడతామబ్బా అని డైలాగులు విసిరారు. తిరుపతి సభను ముందు రోజే అనుకున్నారు. అయినా భారీగా అభిమానులు తరలి వచ్చారు. సాధారణ రాజకీయ పార్టీలకు ఇది సాధ్యం కాదనే అంటున్నారు. అదంతా అభిమాన బలమేనని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+