కుట్రలు జరుగుతున్నాయి: వవన్ కల్యాణ్ జనసేన కీలక ప్రకటన

హైదరాబాద్: తాజా పరిణామాల నేపథ్యంలో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ కీలకమైన ప్రకటనను విడుదల చేసింది. ఈ స్థితిలో కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు సంయమనం పాటించాలని కోరింది.

జనసేనది నాలుగేళ్ల ప్రాయం కూడా నిండని పసిప్రాయమని, ఇటువంటి పసిబిడ్డను ఎదగనీయకుండా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇదంతా రాజకీయంలో ఓ భాగమని అన్నది.

అయినప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారంలో దృఢ చిత్తంతో, అఖండ తెలుగుజాతి అండతో జనసేన తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న విషయం విజ్ఞులందరికీ విదితమేనని అన్నది.

గందరగోళంలో పడేయడానికే..

గందరగోళంలో పడేయడానికే..


ఈ మధ్య కాలంలో జనసేన పార్టీ శ్రేణులను, అభిమానులను గందరగోళంలో పడేయడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నది. జనసేనను తెలుగు ప్రజలు కంటికి రెప్పలా కాపాడుకుంటారని పవన్ కల్యాణ్‌కు విశ్వాసం ఉందని చెప్పింది.

పవన్ మాటలను ఆచరిద్దాం

పవన్ మాటలను ఆచరిద్దాం


పవన్ కల్యాణ్ మాటలను ఆచరిద్దామని జనసేన సూచించింది. పవన్ కల్యాణ్ అడుగు జాడల్లో నడుద్దామని చెప్పింది. జనసేన పార్టీ సిద్ధాంతాలైన కులాలని కలిపే ఆలోచన విదానం.. మతాల ప్రస్తావన లేని రాజకీయం...భాషల్ని గౌరవించే సంప్రదాయం... సంస్కృతులను కాపాడే సమాజం... ప్రాంతీయతని విస్మరించని జాతీయ వాదం... కోసం కృషి చేద్దామని సూచించింది.

కువిమర్శలు చేసేవారి పట్ల ప్రవర్తన

కువిమర్శలు చేసేవారి పట్ల ప్రవర్తన

మనపై కువిమర్శలు చేసేవారి పట్ల మన ప్రవర్తన ఎలా ఉండాలో మన ప్రియతమ నేత గత అక్టోబర్ ఏడో తేదీన విడుదల చేసిన ప్రకటనను మీకు మరోసారి అందిస్తున్నట్లు తెలిపింది. జనసేనను అభిమానించే వారంతా పవన్ కల్యాణ్ అ ప్రకటనల చేసిన సూచలను పాటిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపింది.

విస్మరించాలని పిలుపు

విస్మరించాలని పిలుపు


కువిమర్శలు చేస్తున్నవారిని విస్మరించండని పిలుపునిచ్చింది. పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించింది. ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చింది. ఈ ప్రకటనపై జనసేన ఉాపాధ్యక్షుడు బి. మహేందర్ రెడ్డి సంతకం చేశారు. ఈ ప్రకటనకు నిరుడు అక్టోబర్ 7వ తేదీన చేసిన విజ్ఞప్తిని జత చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+