హోదాకు మద్దతు, పదో షెడ్యూల్ ఉమ్మడి ఆస్తులు సమానంగా పంచాలి: జేఎఫ్‌సి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ (జేఎఫ్‌సీ) పేర్కొంది. హోదా కోసం ఎవరు పోరాడినా మద్దతివ్వాలని జేఎఫ్‌సి నిర్ణయించింది.
వెనుకబడిన ప్రాంతాలకు రూ.20వేల కోట్ల ఆర్థిక సాయం ఇవ్వాలని జేఎఫ్‌సీ నిర్ణయించింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వెంటనే ప్రారంభించాలని చెప్పారు. పోలవరం పూర్తి బాధ్యత కేంద్రానిదే అని చెప్పారు. రాష్ట్రానికి ఇచ్చిన నిధులకు సంబంధించి యుటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నారు.

పదో షెడ్యూల్‌లోని ఉన్న ఉమ్మడి ఆస్తులను సమానంగా పంచాలని జేఎఫ్‌సీ నిర్ణయించింది. కేంద్రం ప్రకటించిన విశ్వవిద్యాలయాలు, సంస్థల నిర్మాణాలు అయిదేళ్లలో పూర్తి చేయాలన్నారు.












Click it and Unblock the Notifications