చిరంజీవి కంటే భేష్!: జగన్‌పై పవన్ కళ్యాణ్ పంచ్ డైలాగ్
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సీమాంధ్రలో పంచ్ డైలాగులతో ఆకట్టుకుంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించాలన్నా, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని ఎత్తుకోవాలన్నా ఆయన తనదైన శైలిలో మాట్లాడుతూ ఆకట్టుకుంటున్నారు.
తనకు తిక్క ఉందని, దానికి ఓ లెక్కా ఉందని ప్రత్యర్థులకు పంచ్ ఇస్తున్నారు. తనకు తిక్క ఉందని, లెక్క లేదని కొందరు చెబుతున్నారంటూ... వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకుపోయిన వారి లెక్కలు మాత్రం ఉన్నాయి అంటూ పవన్ ఉభయగోదావరి జిల్లాల్లో సాగించిన ఎన్నికల ప్రచార సభలు యువకుల్లో ఉత్తేజాన్ని కలిగించాయి.
పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం, తణుకు, తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, రాజమండ్రిలో జరిగిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. నిర్ణీత సమయం కన్నా గంట నుండి ఐదు గంటల పాటు ఆలస్యంగా వచ్చినప్పటికీ యువకులు పెద్ద సంఖ్యలో పవన్ కళ్యాణ్ కోసం ఎదురుచూస్తూనే ఉండిపోయారు.

రాజమండ్రి సభకు మధ్యాహ్నం ఒకటి గంటలకు రావాల్సిన పవన్ సాయంత్రం ఆరు గంటలకు వచ్చారు. అయినప్పటికీ మధ్యాహ్నం ఒంటి గంట నుండి యువకులు పెద్ద సంఖ్యలో అలాగే ఉండిపోయారు. పవన్ తన ప్రసంగాన్ని మొదలుపెడుతూనే జగన్, తెరాస కెసిఆర్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.
పంచ్ డైలాగులతో ప్రసంగం ఆద్యంతం అదరగొట్టిన పవన్ కళ్యాణ్ యువకుల్లో కెవ్వు కేక పుట్టించారు. జగన్‌పై అవినీతి ఆరోపణలు చేయటంతో పాటు, తెరాస అధ్యక్షుడు కెసిఆర్‌పై నిప్పులు చెరిగారు. దేశ సమగ్రత, సీమాంధ్ర అభివృద్ధి తదితర అంశాలను పదే పదే లేవనెత్తటం ద్వారా అటు యువకులను, ఇటు పెద్దలను కూడా ఆకట్టుకునేలా పవన్ కళ్యాణ్ ప్రసంగం సాగింది. కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొంటున్న చిరంజీవి కన్నా, తమ్ముడి ప్రసంగమే వాడిగా వేడిగా ఉందంటున్నారట.












Click it and Unblock the Notifications