లాభం లేదు.. ఇక కార్యాచరణే?: బెజవాడకు పవన్.. రేపు కీలక నిర్ణయం

విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా కోసం జనసేన తరుపున ప్రత్యేక కార్యాచరణకు సిద్దమవుతున్నారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. ఇందుకోసం ఈ నెల 4, 5 తేదీల్లో విజయవాడలో ఆయన పర్యటించనున్నారు.

Recommended Video

    వచ్చే నెల ఆరంభంలో విజయవాడకు పవన్ కళ్యాణ్

    విజయవాడ పర్యటనలో భాగంగా.. 4వ తేదీన వామపక్షాలతో హోదా పోరు ప్రణాళికపై సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక 5వ తేదీన మాజీ సీఎస్ కృష్ణారావు రాసిన 'ఎవరి రాజధాని అమరావతి' పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు.

    pawan kalyans vijayawada tour on 4th and 5th

    అదే రోజున ప్రెసిడెంట్ కమిటీలతోనూ పవన్ వరుస భేటీలు నిర్వహించనున్నారు. నియోజకవర్గ స్థాయిలో పార్టీ సభ్యులను కార్యవర్గంలోకి తీసుకురావాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాలకు మాత్రమే పరిమితమైన ప్రెసిడెంట్ కమిటీలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే యోచనలో ఉన్నట్టు సమాచారం.

    విమర్శలకు చెక్ పెడుతారా? :

    పవన్ ఏ పని చేసినా.. దాన్ని మధ్యలోనే వదిలేస్తారన్న విమర్శలు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి. జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీపై కూడా అదే ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికీ ప్రత్యేక హోదాపై ఆయన తరుపున ప్రత్యక్ష కార్యాచరణ ఏది లేకపోవడం ఆయన చిత్తశుద్దిని ప్రశ్నించేదిగా మారింది. దీంతో ఇక మరింత ఆలస్యం చేయకుండా కార్యరంగంలోకి దూకాలని పవన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+