సినిమాలు వేరు... నిజ జీవితం వేరు: పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
నేను మీసం తిప్పితే రోడ్లు పడతాయా? నన్ను నా పని చేసుకోనివ్వరా? మీరంతా నాచుట్టూ మూగితే రోడ్లు ఎలా ఉన్నాయో నాకెలా కనపడుతుందంటూ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మండిపడ్డారు. సినిమా హీరో కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఎక్కడ పర్యటించడానికి వెళ్లినా అభిమానులంతా చుట్టుముడుతుండటతో పనులకు ఆటంక కలుగుతోంది. తాజాగా ఆయన పార్వతీపురం జిల్లాలోని బాగుజోల గిరిజన గ్రామానికి వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.
అభిమానులను హెచ్చరించిన పవన్ కల్యాణ్
ఈ సందర్భంగా అక్కడి అభిమానులు చుట్టుముట్టారు. దీంతో పవన్ కల్యాణ్ వారికి క్లాస్ తీసుకున్నారు. అంతేకాదు.. గట్టి హెచ్చరిక కూడా చేశారు. తనను పనిచేసుకోనివ్వాలని, ఇలా చుట్టుముడితే పనిచేసుకోలేదని, మీరంతా సినిమాల గురించి అడుగుతున్నారని, తాను ఇక్కడి రోడ్లు ఎలా ఉన్నాయో పరిశీలించి వాటిని బాగుచేయించడానికి వచ్చానన్నారు. అలా కాకుండా మీరంతా నన్ను చుట్టుముట్టి సినిమాల గురించి అడిగితే మీకు సరైన రోడ్లు రావన్నారు. తాను సినిమాలో మీసం తిప్పితే, ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడవని, తాను వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబును అడిగితేనే రోడ్లు పడతాయన్నారు.

మీసం తిప్పండి అంటే రోడ్లు రావు
ఈ పనులమీద తాను ఇక్కడకు వస్తే మీసం తిప్పండి.. అది చేయండి.. ఇది చేయండి అంటారని, తనను పనిచేసుకోవాలని వారందరినీ కోరారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. ఎన్నో కష్టాలకు ఓర్చి, ఎన్నో ఇబ్బందులను తట్టుకొని, అవమాలన్నింటినీ ఎదురించి ఉప ముఖ్యమంత్రి అయ్యారని, ఆయన చక్కగా పనిచేస్తే రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని, దానికోసం పవన్ ఎంతో కష్టపడుతున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సినిమాల్లోనే హీరో కాదని, నిజ జీవితంలో కూడా పవన్ కల్యాణ్ నిజమైన హీరో అంటూ కొనియాడుతున్నారు. పవన్ కల్యాణ్ నుంచి వచ్చే సంవత్సరం హరిమర వీరమల్లు, ఓజీ సినిమాలు విడుదలవుతాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం మాత్రం 2026లో వచ్చే అవకాశం ఉంది. రాజకీయాల్లో బిజీగా ఉండటంవల్ల వీటితర్వాత కొత్త సినిమాలు చేసే అవకాశాలు కూడా లేవు. ఈ విషయంలో పవన్ కల్యాణ్ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.












Click it and Unblock the Notifications