గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దెబ్బకొట్టాడు, ఆ రెండే కారణం!: రూటుమార్చి 'పవర్' వైపు, పవన్ పక్కా వ్యూహంతో!!

|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలకు పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారా? తనకు పదవులు, అధికారంపై ఆసక్తి లేదని చెబుతున్నప్పటికీ ఆయన అడుగులు అదే దిశలో ముందుకు వెళ్తున్నాయా? అంటే అవుననే అంటున్నారు.

చదవండి: ఎన్టీఆర్ తర్వాత.. తెలుగోడి దెబ్బ: మోడీకి పవన్ వార్నింగ్, ఆమరణదీక్ష అవసరమొస్తుందా?

ప్రజలకు ఏదో చేయాలనే తపన ఆయనలో గట్టిగా ఉందని ఎక్కువమంది భావిస్తారు. ప్రజలకు సేవ చేయాలన్నా, అందుకు పార్టీ సుదీర్ఘకాలం నిలబడాలన్నా రాజకీయాల్లో పదవులు, అధికారం ముఖ్యమనే అభిప్రాయానికి పవన్ వచ్చినట్లుగా భావిస్తున్నారు.

చదవండి: పవన్! జాగ్రత్త, నువ్వు జీరో, బీజేపీతో రహస్య ఒప్పందం: టీడీపీ, లోకేష్ అవినీతిపై విష్ణు షాక్

అదే ఆయుధం.. అధికారమే లక్ష్యం

అదే ఆయుధం.. అధికారమే లక్ష్యం

అందుకే, పవన్ కళ్యాణ్ అధికారమే లక్ష్యంగా ప్రణాళికతో ముందుకెళ్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, తనకు పదవులు, అధికారం యావ లేదని చెప్పడమే అతనికి ఉన్న పెద్ద ఆయుధం అని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ ఇచ్చే డబ్బు తీసుకొని జనసేనకు ఓటేయమని ఆయన చెప్పడం గమనార్హం.

ఎన్నికలకు ఏడాది ముందు..

ఎన్నికలకు ఏడాది ముందు..

పవన్ ఇన్నాళ్లు టీడీపీ మద్దతుదారుగా విపక్షాలతో పాటు చాలామందికి కనిపించారు. కానీ అనూహ్యంగా ఆయన పార్టీ ఆవిర్భావ సభలో టీడీపీని, చంద్రబాబును ఏకిపారేశారు. దీంతో ఆయన ఒక్కసారిగా.. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు మరింత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ సభ ద్వారా తాను ఎవరి మద్దతుదారును కాదని తేల్చారని అంటున్నారు.

ప్రభుత్వంపై ఓపిక పట్టడానికి కారణం, దెబ్బతీశాడు

ప్రభుత్వంపై ఓపిక పట్టడానికి కారణం, దెబ్బతీశాడు

తాను వేచి చూసి, ఆ తర్వాత గట్టిగా నిలదీస్తానని పవన్ కళ్యాణ్ పలుమార్లు చెప్పారు. అదే సమయంలో ప్రజలు గెలిపించిన ప్రభుత్వంతో పని చేయించాలనే ఉద్దేశ్యంతోనే తాను ఆలోచిస్తానని, ఇతరుల్లా రాజకీయ విమర్శలు చేయనని కూడా స్పష్టం చేశారు. ఇప్పుడు చంద్రబాబుపై ఓపిక పట్టడానికి అదే కారణమని అంటున్నారు. అయితే, టీడీపీ నేతలు ఇన్నాళ్లు పవన్‌పై ఎంతోకొంత ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఆయనను విమర్శించవద్దని బాబు పదేపదే నేతలకు ఆదేశాలు జారీ చేసేవారు. కానీ ఇప్పుడు అదే పవన్ ఎన్నికలకు ముందు బాగా దెబ్బతీశారని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు.

నిప్పులు చెరగడానికి ఈ రెండు కారణం!

నిప్పులు చెరగడానికి ఈ రెండు కారణం!

పదవులు, అధికారం తనకు ముఖ్యం కాదని కూడా పవన్ చెబుతూ వస్తున్నారు. అయితే, ఎన్నికలకు ఏడాది ముందు ప్రజలకు చేసేందుకు అధికారం ముఖ్యమనే అభిప్రాయానికి ఆయన రావడంతో పాటు, టీడీపీపై వేచిచూసే ధోరణి కూడా పూర్తయిందని అంటున్నారు. ఆవిర్భావ సభలో నిప్పులు చెరగడానికి ఈ రెండు ప్రధాన కారణం కావొచ్చని అంటున్నారు.

ఎన్నికల కోసం వ్యూహాత్మకంగా తనవైపు అలర్ట్

ఎన్నికల కోసం వ్యూహాత్మకంగా తనవైపు అలర్ట్

ఇన్నాళ్లు టీడీపీని గట్టిగా విమర్శించకుండా, చంద్రబాబు మద్దతుదారుగా కనిపించిన పవన్.. ఒక్కసారిగా రెచ్చిపోవడం వెనుక పవన్ వ్యూహం కూడా ఉండి ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు ప్రభుత్వంతో పని చేయించాలనే ఉద్దేశ్యంతో సున్నితంగా మాట్లాడి, ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ ప్రభుత్వం పని చేయడంలేదని చెప్పడం ద్వారా ప్రజల దృష్టిని తన వైపు మరల్చుకోవడం వ్యూహాత్మకంగా జరిగినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఇప్పుడు ఆయన అందరినీ తనవైపు అలర్ట్ చేశారు.

వ్యూహాత్మకంగా ప్రసంగం

వ్యూహాత్మకంగా ప్రసంగం

జనసేన నాలుగో ఆవిర్భావ సభలో పవన్ ప్రసంగం కూడా వ్యూహాత్మకంగానే ఉందని చెబుతున్నారు. విభజన విషయంలో కాంగ్రెస్‌ను మొదట విమర్శించి, ఆ తర్వాత హామీలపై అరుణ్ జైట్లీకి ఇంగ్లీష్‌లో హెచ్చరిక జారీ చేసి, ఆ తర్వాత మధ్యమధ్యలో బీజేపీని, వైసీపీని తెగుడుతూ.. మొత్తానికి టీడీపీని ఏకిపారేశారు. చివర్లో హోదా కోసం ఆమరణ నిరాహార దీక్షకు కూడా సిద్ధమని ప్రకటించారు. ప్రసంగంలోను వ్యూహాత్మక వైఖరి కనబరిచారంటున్నారు.

పవన్ కళ్యాణ్‌కు ఇవే ఆయుధాలు

పవన్ కళ్యాణ్‌కు ఇవే ఆయుధాలు

తాను పదవులు ఆశించడం లేదని, అధికారం కోరుకోవడం లేదని, ప్రజలకు ఏదైనా చేయాలని మాత్రం ఉందని పవన్ చెబుతుంటారు. ఇదే ఆయన ప్రధాన ఆయుధమని అంటున్నారు. అంతేకాదు, అధికారంలో ఉన్న వారిపై ఇతరుల్లా రాజకీయ విమర్శలు కాకుండా.. పనులు చేసే విధంగా ముందుకు సాగుతారనే అభిప్రాయం కూడా చాలామందిలో ఏర్పడింది. అదే సమయంలో ఇతర పార్టీల్లా తాను అధికారంలో ఉన్న పార్టీలను కాంట్రాక్టులు అడగలేదని, పోస్టులు (నామినేటెడ్) అడగలేదని బుధవారం నాటి సభలో చెప్పారు. అది కూడా ఆయనకు పెద్ద ఎసెట్ అంటున్నారు. రాజకీయల్లో నా వారు అంటూ ఎవరు లేరని, అందుకే తన వారి కోసం అంటూ ఎవరినీ ఏ పదవులు అడగలేదని, ప్రజలే తన ఓటు బ్యాంకు, కుటుంబం అని ఆయన చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ కాంగ్రెస్‌కు అండగా ఉంటారా, అలా అయితే ఆయన సోదరుడు చిరంజీవిని సీఎం చేస్తారా అనే చర్చ సాగుతోంది.

English summary
Pawan Kalyan spoke of Andhra pride and Telugu self esteem in Guntur meeting. He also brought up the issue of special status for the state, and threatened to launch a fast unto death if it's not granted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X