నిరుద్యోగులకు పవన్ కళ్యాణ్ అండ: రేపట్నుంచి నిరసన, ఆ ఇద్దరు మంత్రులు 30 కోట్ల స్కామంటూ మహేష్
అమరావతి: ఆందోళన చేస్తున్న నిరుద్యోగులకు అండగా ఉంటామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆందోళనలకు దిగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు తెలుపగా.. తాజాగా జనసేన కూడా అండగా నిలుస్తున్నట్లు ప్రకటించింది.

ఏపీ నిరుద్యోగులకు అండగా పవన్ కళ్యాణ్
పలువురు నిరుద్యోగులు పవన్ కళ్యాణ్‌ను కలిసి తమ ఆవేదనను తెలియజేశారు. దీంతో ప్రత్యక్షంగా ఆందోళనల్లో పాల్గొనేందుకు సమాయత్తమవుతోంది. మంగళవారం ఏపీలోని అన్ని ఎంప్లాయిమెంట్ ఆఫీసుల్లో వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జనసైనికులకు పిలుపునిస్తూ పవన్ కళ్యాణ్ ఓ వీడియోను విడుదల చేశారు. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ సమస్యలపై ఈ వీడియోలో స్పందించారు. రాజకీయ నిరుద్యోగుల కోసం లేని పదవులు సృష్టించారు కానీ.. ఆ చొరవ, ఆసక్తి నిరుద్యోగులపై లేదని పవన్ కళ్యాణ్ ఏపీ సర్కారుపై మండిపడ్డారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగుల బాధ కలిచివేస్తోందన్నారు. 151 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వం అధికారంలోకి రావడానికి 30 లక్షల మంది మద్దతు కారణమని అన్నారు.
Recommended Video

రేపట్నుంచే జనసేన నిరసనలు
2.50 లక్షల ఉద్యోగాలు ఇస్తామని.. ఇప్పుడు 10 వేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ పెట్టారన్నారు. ఇది నిరుద్యోగులను నయవంచన చేయడమేనని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. మరోవైపు పోలీసు శాఖలో వేల పోస్టులు ఖాళీగా ఉంటే.. జాబ్ క్యాలెండర్‌లో వందల పోస్టులే పెట్టారన్నారు. ఇక డీఎస్సీ ఊసేలేదన్నారు. నిరుద్యోగులకు జనసేన అండగా ఉంటుందని, మంగళవారం అన్ని జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇస్తామని, జనసైనికులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

ఆ ఇద్దరు మంత్రులు 30 కోట్ల స్కామంటూ పోతిన మహేష్ ఆరోపణలు
ఇది ఇలావుండగా, జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఇద్దరు మంత్రులు రూ. 30 కోట్ల స్కాంకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. టెక్స్‌స్టైల్ పార్క్ పేరుతో మంత్రులు శ్రీనివాస్, గౌతమ్ రెడ్డి రూ. 30 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. తన ఆరోపణలు అబద్ధమైతే.. విజయవాడ కనకదుర్గమ్మపై ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. మంత్రి వెల్లంపల్లికి, ప్రభుత్వ జీవోతో లబ్ధి పొందిన సంస్థకు, అందులోని భాగస్వాములకు సంబంధం లేని దుర్గమ్మపై ప్రమాణం చేయాలన్నారు. వచ్చే శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఇంద్రకీలాద్రి వద్దకు రావాలని, తప్పుచేయకుంటే ధైర్యంగా దుర్గమ్మపై ప్రమాణం చేయాలన్నారు పోతిన మహేశ్. శుక్రవారం తాను కూడా దుర్గమ్మ ఆలయానికి వస్తానని చెప్పారు.
-
కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్.. -
నెలకు రూ.69,100 జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు..! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి












Click it and Unblock the Notifications