పవన్ కల్యాణ్ పక్కా ప్లాన్: ప్రత్యేక హోదాపై రహస్య సర్వే
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్లాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రత్యేక హోదాపై ఆయన సర్వే నిర్వహిస్తున్నట్లు సమాచారం.
విజయవాడ: వచ్చే ఆంధ్రప్రదేశ్ శానససభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆసక్తి చూపుతున్నారా, లేదా అనే విషయం తెలుసుకోవడానికి ఆయన సర్వే నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రత్యేక హోదా కావాలని యాభై శాతం మందికి పైగా భావిస్తే రాజీపడకుండా పోరాటాన్ని ముందుకు తీసుకుని వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ వైపు ప్రజలు మొగ్గు చూపితే అందుకు గల కారణాలేమిటో తెలుసుకుని, దానిద్వారా చేకూరే ప్రయోజనాలు ఏమటినేవి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారని అంటున్నారు. రాష్ట్రంలో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న అన్ని ప్రాంతాల జాబితాను ఆయన తయారు చేసినట్లు చెబుతున్నారు.
ఆ జాబితాకు తుది రూపం వచ్చిన తర్వాత సినిమాల్లో నటించడం మానేసి ఎర్ర కండువాతో పాదయాత్ర ప్రారంభిస్తారని అంటున్నారు. 2019 ఎన్నికల నాటికి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడేందుకు ఈ పాదయాత్రను వాడుకోవాలని ఆయన చూస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications